News February 23, 2025

ASF: విద్యార్థులకు అలర్ట్.. మోడల్ స్కూల్ దరఖాస్తులు

image

2025-26 విద్యా సంవత్సరానికి తెలంగాణ మోడల్ స్కూల్‌లలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని అధికారులు తెలిపారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు (మిగిలిన సీట్లకు) దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి 28 చివరి తేదీ అన్నారు. ప్రవేశ పరీక్ష తేదీ ఏప్రిల్ 13న ఉంటుందన్నారు. పరీక్ష ఫీజు SC, ST, BC, PHC& EWSలకు రూ.125, OC విద్యార్థులకు రూ.200 ఉంటుందన్నారు.

Similar News

News November 8, 2025

ఈ స్నాక్స్ ట్రై చేయండి

image

పిల్లలు స్కూల్లో, పెద్దలు ఆఫీసుల్లో తినడానికి బెస్ట్ స్నాక్స్
*వేయించిన శనగలు
*బాదాం లేదా వాల్‌నట్స్
*ఆపిల్ లేదా జామ
*డార్క్ చాక్లెట్లు
*హోం మేడ్ ప్రొటీన్ లడ్డూ
*గుమ్మడి, అవిసె, చియా సీడ్స్
*ఉడకబెట్టిన గుడ్డు

News November 8, 2025

వరంగల్‌: కొత్త ఓటర్లూ.. మీకోసమే!

image

ఉమ్మడి జిల్లాలో కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ మొదలైంది. స్థానిక ఎన్నికల ఓటరు జాబితాను ఇప్పటి వరకు రెండు సార్లు మార్చగా మళ్లీ నవీకరిస్తున్నారు. దీంతో ఈనెల 15 వరకు కొత్తగా నమోదయ్యే ఓటర్లను జాబితాలో చేర్చనున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 22,45,553 మంది ఓటర్లు ఉండగా.. WGL 3,85,163, HNK 3,72,646, జనగామ 4,01,115, MHBD 5,51,999, ములుగు 2,31,052, BHPLలో 3,03,556 మంది ఉన్నారు. ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

News November 8, 2025

ADB: అవినీతిలో మునిగి తేలుతున్నారు..!

image

అవినీతి అధికారులు సామాన్యులను పీడిస్తున్నారు. ఆసిఫాబాద్ సివిల్ సప్లైస్ జిల్లా మేనేజర్ గురుబెల్లి వెంకటనరసింహారావు, టెక్నికల్ అసిస్టెంట్ మణికాంత్ రూ.75,000 లంచం తీసుకుంటుండగా ACB అధికారులు పట్టుకున్నారు. గతంలో మంచిర్యాల జిల్లాలో ఇద్దరు అధికారులు పశువుల షెడ్డుకు రూ.10 వేలు, సస్పెన్షన్ ఎత్తివేత కోసం రూ.2 లక్షలు లంచం డిమాండ్ చేస్తూ ఏసీబీకి చిక్కారు. ఎవరైనా లంచం అడిగితే 1064/9440446106కు కాల్ చేయండి.