News April 17, 2025
ASF: వైద్య సిబ్బందికి DMHO హెచ్చరికలు

వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని జిల్లా వైద్యాధికారి సీతారాం అన్నారు. బుధవారం చింతలమానేపల్లి మండలం దిందా పల్లె దవాఖానాను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు వైద్యం అందుబాటులో తీసుకొచ్చేందుకు పల్లె దవాఖానాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రికార్డులను పరిశీలించారు. అనంతరం కుష్టు వ్యాధి నిర్మూలనపై అవగాహన కల్పించారు.
Similar News
News April 19, 2025
ప్రవీణ్ శరీరంపై 18 గాయాలున్నాయి: హర్షకుమార్

పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసులో పోస్టుమార్టం రిపోర్టు బహిర్గతం చేయడానికి ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తోందని మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ నిలదీశారు.శుక్రవారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రవీణ్ కేసులో పోలీసుల దర్యాప్తును తనతో సహా ఎవ్వరూ విశ్వసించడం లేదని వ్యాఖ్యానించారు. తన వద్దకు వచ్చిన పోస్టుమార్టం రిపోర్ట్ ప్రకారం ప్రవీణ్‌పై 18 శరీరంపై గాయాలున్నాయని, ఇది ముమ్మాటికీ హత్యే అని పేర్కొన్నారు.
News April 19, 2025
ఈనెల 23 నుంచి JEE అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్

జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈనెల 23న ప్రారంభం కానుంది. మే 2 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తొలుత <<16144953>>మెయిన్‌లో<<>> సాధించిన మార్కుల ఆధారంగా ర్యాంకులు కేటాయిస్తారు. ఆ తర్వాత ర్యాంకులు, రిజర్వేషన్ల ఆధారంగా మొత్తం 2.50 లక్షల మందికి అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తారు. ఈ పరీక్ష మే 18న జరగనుంది. జూన్ 2న ఫలితాలు వెలువడుతాయి.
News April 19, 2025
రాష్ట్రంలో ఎక్కడా బర్డ్ ఫ్లూ లేదు: పశు సంవర్ధక శాఖ

AP: రాష్ట్రంలో ఎక్కడా బర్డ్ ఫ్లూ లేదని పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ టి.దామోదరనాయుడు తెలిపారు. ఈ మేరకు భోపాల్‌లోని జాతీయ అత్యున్నత భద్రతా జంతు వ్యాధుల సంస్థ నిర్ధారించిందన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో పెద్ద ఎత్తున కోళ్ల మరణాలు సంభవించగా శాంపిల్స్ భోపాల్ పంపించి టెస్ట్ చేయించినట్లు వివరించారు. పల్నాడులో బర్డ్ ఫ్లూతో చిన్నారి మృతిచెందిన ప్రాంతంలో 70మంది శాంపిల్స్ పరీక్షించగా నెగటివ్ వచ్చిందని చెప్పారు.