News April 7, 2025

ASF: సోలార్ తీగలు తగిలి రైతులు మృతి

image

సొలార్ విద్యుత్ తీగలు తగిలి రైతు మృతి చెందిన ఘటన ఆసిఫాబాద్ మండలంలో చోటు చేసుకుంది. ఆసిఫాబాద్ సీఐ రవీందర్ వివరాల ప్రకారం.. ఇప్పల్ నవేగాంకి చెందిన నీకోరె బాపూజీ శనివారం రాత్రి తన అన్న ఎడ్లు ఇంటికి రాకపోవడంతో వెతకడానికి వెళ్లాడు. తెల్లారేసరికి ఇంటికి రాకపోవడంతో ఆదివారం రాథోడ్ వివేక్ పొలం పక్కనున్న కెనాల్‌లో ఏర్పాటుచేసిన సొలార్ తీగలకు తగిలి మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News April 9, 2025

గుంటూరు: వృద్దురాలి హత్యకేసులో నిందితులు అరెస్ట్ 

image

పాత గుంటూరు ఆనందపేటలో వృద్ధురాలిని హత్య చేసిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ తెలిపిన వివరాలు ప్రకారం.. అర్షద్ అనే యువకుడు ఓ బాలికను ప్రేమిస్తున్నాడు. ఆమె సోదరులను తన బావమర్దులని చెప్తున్నాడు. దీంతో బాలిక సోదరులు, అర్షద్ కుటుంబాల మధ్య గొడవ జరుగుతోంది. ఈ క్రమంలో జరిగిన ఘర్షణలో బాలిక సోదరులు ఫైరోజ్, ఫయాజ్‌లు అర్షద్ అమ్మమ్మ ఖాజాబి(70)ని కొట్టడంతో ఆమె చనిపోయింది.

News April 9, 2025

వెంకటగిరిలో టెన్షన్.. టెన్షన్

image

తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపల్ ఛైర్‌పర్సన్ నక్కా భానుప్రియపై ఇవాళ అవిశ్మాస తీర్మానం జరగనుంది. అధికారులు 144 సెక్షన్ అమలుతో పక్కాగా ఏర్పాట్లు చేశారు. మొత్తం 25 వార్డుల్లో వైసీపీనే గెలవగా ఎన్నికలకు ముందు ముగ్గురు టీడీపీలో చేరారు. మరికొందరు భానుప్రియపై అసంతృప్తిగా ఉన్నారు. టీడీపీ సాయంతో భానుప్రియను కుర్చీ దింపడానికి మాజీ మున్సిపల్ ఛైర్మన్ దొంతు శారద ప్రయత్నిస్తుండగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

News April 9, 2025

REWIND: నిర్మల్‌లో ఘోరం.. 1000 మందిని ఉరితీశారు.!

image

ప్రపంచంలో ఎక్కడా కనీవినీ ఎరగని రీతిలో నిర్మల్‌లో ఘోరం జరిగింది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసిన రాంజీ గోండు, అతడి 1000 మంది అనుచరులను బంధించారు. 1860 ఏప్రిల్ 9న పట్టణంలోని ప్రస్తుతం కురన్నపేట్ దగ్గరున్న ఖజానా చెరువు వద్దనున్న ఊడలమర్రి చెట్టుకు ఒకేసారి ఉరితీసి చంపేశారు. ఇది జలియన్ వాలాబాగ్ కంటే అత్యంత భయంకరమని చరిత్రకారులు పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం ఆ చెట్టు వర్షాలకు కూలిపోయింది.

error: Content is protected !!