News March 10, 2025

ASF: 108 అంబులెన్స్‌లో కవలలు పుట్టారు..!

image

ఆసిఫాబాద్ మండలం చిర్రకుంటకు చెందిన హరిక అనే మహిళకు పురిటినొప్పులు రాగా కుటుంబ సభ్యులు అంబులెన్స్‌కు సమాచారాన్ని అందించారు. హారికని అంబులెన్స్‌లో ఆసిఫాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ఆమెను మంచిర్యాల ఆసుపత్రికి రిఫర్ చేశారు. 108 వాహనంలో మంచిర్యాల తీసుకెళ్తున్న క్రమంలో నొప్పులు అధికం కావడంతో అంబులెన్స్ సిబ్బంది చేశారు. హారిక పండంటి ఆడ కవలలకు జన్మనిచ్చింది. ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.

Similar News

News September 18, 2025

లిక్కర్ స్కాం.. 20 చోట్ల ఈడీ తనిఖీలు

image

ఏపీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి దేశవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలో బోగస్ పేమెంట్లకు సంబంధించి లావాదేవీలు చేసిన వారి సంబంధీకుల ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 18, 2025

HYD: పార్కులు కాపాడిన హైడ్రా.. హెచ్చరిక బోర్డులు

image

హైడ్రా అధికారులు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుని పార్కు స్థలాలను ఆక్రమణల నుంచి రక్షించారు. కూకట్‌పల్లి మూసాపేట సర్కిల్‌లోని సనత్‌నగర్ కోఆపరేటివ్ సొసైటీ లే ఔట్‌లో 1600 గజాల భూమిని, రంగారెడ్డి జిల్లా మదీనాగూడలో పార్కు కోసం కేటాయించిన 600ల గజాల స్థలాన్ని కాపాడారు. ఫెన్సింగ్, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.

News September 18, 2025

పాలు పితికే సమయంలో పాడి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

పాలు పితకడానికి ముందు గేదె/ఆవు పొదుగు, చనులను గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. పాలు పితికే వ్యక్తి చేతులకు గోళ్లు ఉండకూడదు. చేతులను బాగా కడుక్కొని పొడిగుడ్డతో తుడుచుకున్నాకే పాలు తీయాలి. పొగ తాగుతూ, మద్యం సేవించి పాలు పితక వద్దు. పాల మొదటి ధారల్లో సూక్ష్మక్రిములు ఉంటాయి. అందుకే వేరే పాత్ర లేదా నేలపై తొలుత పిండాలి. పాలను సేకరించే పాత్రలను శుభ్రంగా ఉంచకపోతే తీసిన పాలు త్వరగా చెడిపోతాయి.