News March 21, 2025
ASF: 400 మందికి దరఖాస్తులు కావడం లేదు..!

జిల్లాలోని నాయీ బ్రాహ్మణులు నేడు జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. గత 2023-24 ఆర్థిక సంవత్సరానికి జిల్లాలోని నాయీ బ్రాహ్మణులు 400మంది బీసీ బంధు కోసం దరఖాస్తు చేసుకున్నామన్నారు. అది రాకపోగా.. నేడు రాజీవ్ యువ వికాసం కోసం దరఖాస్తులు కావడం లేదని వాపోయారు. ఆన్లైన్ చేస్తుంటే అప్లై కావడం లేదని.. సమస్యను పరిష్కరించాలని కోరారు.
Similar News
News November 24, 2025
కాళోజీ యూనివర్సిటీలో విజిలెన్స్ తనిఖీలు

డబ్బులు తీసుకొని <<18373249>>మార్కులు కలిపారంటూ వచ్చిన కథనాల<<>>పై విజిలెన్సు అధికారులు కదిలారు. WGL కాళోజీ హెల్త్ యూనివర్సిటీ PG పరీక్షల రీకౌంటింగ్లో జరిగిన అవకతవకలపై ఎగ్జామినేషన్ బ్రాంచ్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో విజిలెన్సు అధికారులు ఎగ్జామినేషన్ విభాగంలోని అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఎవరి లాగిన్లో ఈ అక్రమాలు జరిగాయో అధికారుల తనిఖీ అనంతరం బయటపడే అవకాశం ఉంది.
News November 24, 2025
అపరిచితులకు మీ వివరాలు ఇవ్వొద్దు: పోలీసులు

కేవలం 5 నిమిషాల్లో లోన్ వస్తుందనే మాటల్ని నమ్మి, అపరిచితులకు మీ వివరాలు ఇవ్వద్దని వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు ప్రజలకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్బీఐ అనుమతి లేని యాప్స్ను ఇన్స్టాల్ చేయొద్దని, వాటి నుంచి లోన్ తీసుకోవద్దని, ఎవరికి ఆన్లైన్లో ఆధార్ కార్డు, పాన్ కార్డు పంపించొద్దని పోలీసులు ప్రజలకు సూచనలు చేశారు.
News November 24, 2025
నటుడు ధర్మేంద్ర ఆరోగ్య పరిస్థితి విషమం

బాలీవుడ్ వెటరన్ యాక్టర్ ధర్మేంద్ర ఆరోగ్యం విషమించింది. ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆయన తర్వాత కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా ఆయన ఆరోగ్యం మరోసారి క్షీణించింది. ఈక్రమంలోనే అంబులెన్స్ ఆయన ఇంటికి చేరుకుంది. అటు బంధువులు, బాలీవుడ్ ప్రముఖులు ధర్మేంద్ర ఇంటికి వెళ్తున్నారు.


