News November 8, 2025

ASF: 571 కేసులు.. 38 మంది అరెస్ట్.. 40 వాహనాలు సీజ్

image

ఆసిఫాబాద్ జిల్లాలో గుడుంబా, దేశీదారు అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టామని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ జ్యోతి కిరణ్ తెలిపారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 571 గుడుంబా కేసులను నమోదు చేసి, 38 మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఇందులో 40 వాహనాలను కూడా సీజ్ చేశారు. సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద తనిఖీలను ముమ్మరం చేయడంతో పాటు, ప్రభావిత గ్రామాల్లో నిఘా పెట్టినట్లు ఆయన పేర్కొన్నారు.

Similar News

News November 8, 2025

భక్త కనకదాస రచనలు అనుసరణీయం: ఎస్పీ

image

భక్త కనకదాస జయంతి సందర్భంగా శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు కనక దాస చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడారు. కనకదాస రచనలు, కీర్తనల ద్వారా సమాజంలోని కుల అసమానతలను రూపుమాపేందుకు కనకదాస చేసిన కృషి ఎనలేనిదన్నారు. ఆయన రచనలు ప్రజల్లో భక్తి, సమానత్వం, న్యాయం, సత్యం వంటి విలువలను బోధించాయని పేర్కొన్నారు.

News November 8, 2025

ఈనెల 10న యథాతధంగా పీజీఆర్ఎస్‌: కలెక్టర్

image

పీజీఆర్ఎస్‌ కార్యక్రమం ఈనెల 10 సోమవారం యథాతధంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ కీర్తి చేకూరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు వ్యయప్రయాసలకు గురి కాకుండా తమ డివిజన్‌, మండల కేంద్రాలు, గ్రామ-వార్డు సచివాలయాల్లోనే అర్జీలు సమర్పించి పరిష్కారం పొందాలని సూచించారు. అలాగే 1100 టోల్‌ఫ్రీ నంబర్‌ లేదా meekosam.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా కూడా ఫిర్యాదులు ఇవ్వొచ్చని పేర్కొన్నారు.

News November 8, 2025

మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో మేనేజర్ పోస్టులు

image

మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 17 కాంట్రాక్ట్ మేనేజర్ పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. బీఈ, బీటెక్‌తో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈ నెల 28 వరకు అప్లై చేసుకోవచ్చు. సీనియర్ మేనేజర్లకు నెలకు రూ.70వేలు, జూనియర్ మేనేజర్‌లకు రూ.30వేల జీతం చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://ddpdoo.gov.in/