News August 28, 2025

ASF: 7 కాళ్లు, 2 కడుపుల గొర్రెపిల్ల జననం

image

పెంచికలపేట మండలం పోతపల్లిలో వింత గొర్రె పిల్ల జన్మించింది. డోకే కమలాకర్‌కు సంబంధించిన గొర్రె 7 కాళ్లు, రెండు కడుపులు, రెండు తోకలు, ఒక తలతో వింత గొర్రెపిల్ల పుట్టి మరణించిందని రైతు తెలిపారు. అది చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి తిలకించారు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్టు వింతలు జరుగుతున్నాయని ప్రజలు అంటున్నారు.

Similar News

News August 28, 2025

MTM: మెగా డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన

image

మెగా డీఎస్సీలో అర్హత సాధించిన కృష్ణా జిల్లా అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన గురువారం మచిలీపట్నంలోని నోబుల్ కళాశాలలో జరిగింది. 1048 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు తెలిపారు. ఈ తనిఖీ కోసం ఐదుగురు సభ్యులతో కూడిన ఎంఈఓ, రెవెన్యూ శాఖల బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన చెప్పారు.

News August 28, 2025

MNCL: బీజేపీ జిల్లా నూతన కార్యవర్గం నియామకం

image

బీజేపీ జిల్లా నూతన కార్యవర్గాన్ని నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ తెలిపారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆదేశాల మేరకు జిల్లా కమిటీలో ఆరుగురు ఉపాధ్యక్షులు, ముగ్గురు ప్రధాన కార్యదర్శులు, ఒక కోశాధికారి, జిల్లా కార్యాలయ కార్యదర్శి, సోషల్ మీడియా, ఐటీ కన్వీనర్లతో పాటు 45 మంది జిల్లా కార్యవర్గ సభ్యులు, 10 మంది శాశ్వత ఆహ్వానితులను నియమించినట్లు పేర్కొన్నారు.

News August 28, 2025

MNCL: వరద ఎఫెక్ట్.. ఆసుపత్రి పేషంట్ల తరలింపు

image

గోదావరి ప్రవాహం గంటగంటకు పెరిగిపోతూ వరద లోతట్టు ప్రాంతాలకు చేరుతుండగా తదితరులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. మాతాశిశు ఆసుపత్రి నుంచి పేషంట్లను ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్నారు. గత సంవత్సరం ఆస్పత్రిలోకి వరద నీరు చేరిన విషయం తెలిసిందే. ఎల్లంపల్లి గేట్లు ఎత్తివేయడంతో గోదావరి ప్రవాహం ఉదృతంగా సాగుతోంది. రాళ్లవాగు నీరు పోటుకమ్ముతు లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్తుంది.