News January 30, 2025

ASF: 8వ తరగతి విద్యార్థి పరికరం.. రాష్ట్రస్థాయికి ఎంపిక

image

విద్యార్థులు విద్యార్థి దశలోనే సృజనాత్మకతతో నైపుణ్యాలను వెలికితీసి శాస్త్రవేత్తలుగా ఎదగాలని ట్రస్మా జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి రాధాకృష్ణాచారి అన్నారు. జిల్లా కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న సుమిత్ సోలంకి రూపొందిన ఎలక్ట్రానిక్ హమ్మర్ పరికరం బాల్ వైజ్ఞానిక ప్రదర్శనలో రాష్ట్ర స్థాయిలో ఎంపికైంది. ఈ నేపథ్యంలో విద్యార్థిని బుధవారంసన్మానించారు.

Similar News

News February 9, 2025

మెదక్: నకిలీ బంగారంతో భారీ మోసం.. నలుగురి అరెస్ట్

image

నకిలీ బంగారం పెట్టి తూకంలో మోసం చేసిన ఘటన నర్సాపూర్‌లో జరిగింది. పోలీసుల వివరాలు.. పట్టణంలోని ముత్తూట్ మినీ ఫైనాన్స్ మేనేజర్‌గా గుండె రాజు సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. తనకు పరిచయం ఉన్న సురేశ్, ఆకాశ్‌లతో కలిసి నకిలీ బంగారంతో చేసి రూ.7,20,356 నగదును సంస్థ నుంచి తీసుకుని బ్యాంకును మోసం చేసి తప్పించుకున్నాడు. రీజనల్ మేనేజర్ రాజు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నలుగురిని అరెస్ట్ చేశారు.

News February 9, 2025

మంచిర్యాల: పావురం కోసం క్రేన్ పంపిన కలెక్టర్

image

నస్పూర్‌లోని సీసీసీ కార్నర్‌లో సెంట్రల్ లైటింగ్ స్తంభంపై ఓ పావురం గాలిపటం దారానికి చిక్కుకుంది. గమనించిన స్థానికులు కలెక్టరేట్‌కు సమాచారం అందజేయడంతో స్పందించి కలెక్టర్ క్రేన్‌ను పంపించారు. అక్కడకు చేరుకున్న మున్సిపల్ సిబ్బంది నిచ్చెన సాయంతో పైకి ఎక్కి దాన్ని విడిపించారు. దీంతో పావురం అక్కడనుంచి స్వేచ్ఛగా ఎగిరిపోయింది.

News February 9, 2025

భార్యను నరికిన ఘటనలో మరో సంచలనం!

image

TG: హైదరాబాద్ మీర్‌పేట్‌లో భార్యను ముక్కలుగా నరికిన <<15262482>>ఘటనలో<<>> మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. వెంకటమాధవిని చంపేందుకు భర్త గురుమూర్తికి మరో ముగ్గురు కుటుంబీకులు సహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారని భావిస్తున్నారు. ఆ ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు శనివారం నుంచి గురుమూర్తిని కస్టడీలోకి తీసుకొని మరింత లోతుగా విచారిస్తున్నారు.

error: Content is protected !!