News May 2, 2024
ASF: CM రేవంత్ రెడ్డి మాట్లాడిన ముఖ్యాంశాలివే..!
ఆసిఫాబాద్ జిల్లాలో నిర్వహించిన జనజాతర సభలో CM రేవంత్ రెడ్డి మాట్లాడిన ముఖ్యాంశాలు. ★ ఆదిలాబాద్ జిల్లాతో నాకెంతో అవినాభావ సంబంధం ఉంది ★ ఉమ్మడి జిల్లాకు కేసీఆర్ చేసిందేమీ లేదు
★ సోయం బాపురావుకు టికెట్ ఇవ్వకుండా అవమానించిన BJP
★ అడవి బిడ్డలకు అండగా నిలబడిన మంత్రిగా సీతక్క
★ మూతబడిన CCI గురించి పట్టించుకోని మోదీ, కేసీఆర్ ★పదేళ్లు గిరిజనుల సమస్యలు పట్టించుకోని KCR.
Similar News
News November 5, 2024
బెల్లంపల్లి: ‘రాజకీయ అండతోనే భూకబ్జాకు ప్రయత్నం’
బెల్లంపల్లి పట్టణం స్థానిక రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న శ్రీ సంజీవని హనుమాన్ దేవాలయ భూములను పరిరక్షించాలని విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ సభ్యులు డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు రేవల్లి రాజలింగు మాట్లాడుతూ.. దేవాలయ భూముల కబ్జాకు దౌర్జన్యంగా రాజకీయ అండతోనే కబ్జాకు పాల్పడుతున్నారని ఆరోపించారు. భూముల కబ్జాకు ప్రయత్నిస్తున్న దుండగులపై కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు.
News November 5, 2024
మానవత్వం చాటుకున్న బెల్లంపల్లి ఆటో డ్రైవర్
మంచిర్యాల నుంచి బెల్లంపల్లి వైపు వెళ్తున్న ఆటోలో గోదావరిఖనికి చెందిన ప్రయాణికుడు మందమర్రిలో ఆటో దిగి బ్యాగ్ మర్చిపోయాడు.బెల్లంపల్లికి చేరుకున్న ఆటో డ్రైవర్ తిరుపతి విషయాన్ని బెల్లంపల్లి ఆటో యూనియన్ అధ్యక్షుడు కట్టరాం కుమార్ కి సమాచారం అందించారు. అయిన ద్వారా బ్యాగుని బాధితుడికి అప్పచెప్పారు. బ్యాగ్‌లో విలువైన బ్యాంక్ పత్రాలు, కొత్త బట్టలు ఉన్నట్లు బాధితుడు తెలిపారు.
News November 4, 2024
ఆదిలాబాద్: ఇద్దరు సోయాబీన్ దొంగలు అరెస్ట్
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో సోయాబీన్ దొంగలించిన కేసులు ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు టూటౌన్ సీఐ కరుణాకర్ తెలిపారు. గత నెల 30న మార్కెట్ యార్డ్‌లో దొంగతనం అయినట్లు సీఈవో కేదార్ పండరి ఫిర్యాదు చేశారన్నారు. దర్యాప్తులో భాగంగా స్థానిక వడ్డెర కాలనీకి చెందిన ఎ.రాజు, ఎస్.రాజు సోయాబీన్ 50 కేజీలు దొంగతనం చేసినట్లు గుర్తించి అరెస్టు చేసినట్లు తెలిపారు. సోయాబీన్ స్వాధీనం చేసుకున్నామన్నారు.