News March 9, 2025
ASF: MLC రేసులో రేఖానాయక్?

కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రేఖానాయక్ MLA కోటా MLC రేసులో ముందు వరుసలో ఉన్నారు. 2024 ఎన్నికల ముందు బీఆర్ఎస్‌లో ఉన్న ఆమె ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవటంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలోనూ ఆమెకు అవకాశం దక్కలేదు. సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థుల ఎంపికపై అదిష్ఠానంతో చర్చించనున్నారు. ఎస్టీ కేటగిరీ నుంచి రేఖానాయక్‌కు అవకాశం దక్కుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే
Similar News
News October 16, 2025
క్యాన్సర్ రోగులకు ప్రత్యేక వైద్య సేవలు: కలెక్టర్

రాజమహేంద్రవరం జీజీహెచ్‌లోని ఆంకాలజీ విభాగంలో క్యాన్సర్ రోగులకు ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ కీర్తి చేకూరి ప్రకటించారు. గురువారం ఆసుపత్రిలో ఆమె వైద్య సేవలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆసుపత్రిలో అందిస్తున్న సేవలు, మౌలిక వసతులు, వైద్య పరికరాల స్థితి, సిబ్బంది భర్తీ, నిర్మాణ పనుల పురోగతి, పరిశుభ్రత వంటి అంశాలపై అధికారులతో కలెక్టర్ సమగ్రంగా చర్చించారు.
News October 16, 2025
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో నాలుగు నెలల గరిష్ఠాన్ని తాకాయి. సెన్సెక్స్ 862 పాయింట్ల లాభంతో 83,467, నిఫ్టీ 261 పాయింట్ల లాభంతో 25,585 వద్ద ముగిశాయి. Nestle, టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్, కోటక్ మహీంద్రా, టైటాన్, యాక్సిస్ బ్యాంక్ టాప్ గెయినర్స్. HDFC లైఫ్, ఎటర్నల్, శ్రీరామ్ ఫైనాన్స్, SBI లైఫ్ ఇన్సూరెన్స్, జియో ఫైనాన్షియల్ టాప్ లూజర్స్.
News October 16, 2025
అంకాపూర్ చికెన్ తిన్నారా..?

అంకాపూర్ చికెన్ అంటే తెలియని వారు ఉండరు. తిన్నారంటే ఆహా అనాల్సిందే. ఇవాళ ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా మెస్ నిర్వహాకులు మాట్లాడారు. ఈ చికెన్ కోసం తామే సొంతంగా మసాల తయారు చేస్తామన్నారు. ఇప్పటికే పలు జిల్లాలోని హోటళ్లలో అంకాపూర్ చికెన్ బ్రాండ్‌తో విక్రయిస్తారంటే అర్థం చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా ఈ చికెన్ తిన్నారా..! తింటే ఎలా ఉందో కామెంట్ చేయండి.