News March 15, 2025

ASF: ‘PMSY పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి’

image

ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మత్స్యశాఖ అధికారి రాజు నర్సయ్య అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో 14000ల మత్స్యకారులు ఉన్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.6000 కోట్లతో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాన్ని ప్రారంభించిందని పేర్కొన్నారు. ఈ పథకం కోసం నిర్మల్ జిల్లాలోని మత్స్యకారులు మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Similar News

News February 8, 2026

పాకల బీచ్ ఫెస్టివల్‌ కు రానున్న ప్రముఖ యాంకర్

image

సింగరాయకొండ మండలం పాకల బీచ్ వద్ద ఈనెల 14, 15వ తేదీలలో జరగనున్న బీచ్ ఫెస్టివల్‌కు ప్రముఖ యాంకర్ సుమ రానున్నారు. ఇదే విషయాన్ని మంత్రి స్వామి సైతం వెల్లడించారు. రెండు రోజులపాటు ఘనంగా నిర్వహించే ఫెస్టివల్‌కు పలువురు కమెడియన్లు సైతం రానున్నారు. ప్రతిష్ఠాత్మకంగా బీచ్ ఫెస్టివల్ నిర్వహించనున్న నేపథ్యంలో ఇక్కడ నిర్వహించే కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకోనున్నాయి.

News February 8, 2026

NZB: అర్వింద్ దేవుడి పేరు చెప్పి రాజకీయాలు చేస్తుండు: TPCC

image

నిజాంబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి దేవుడి పేరు చెప్పి రాజకీయాలు చేస్తున్నారని TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. ఆదివారం నగరంలోని కోటగల్లీలో నిర్వహించిన కాంగ్రెస్ కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. దేవుడి పేరు చెప్పి ఓట్లడిగే అర్వింద్‌కు పని చేసే ముఖం ఉందా అని ప్రశ్నించారు.

News February 8, 2026

బాధితులకు ఫోన్లు అందజేసిన బాపట్ల ఎస్పీ

image

బాపట్ల జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీకి గురైన, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. ఈ మేరకు SP ఉమామహేశ్వర్ ఆదివారం మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానంతో వీటిని ట్రాక్ చేసి రికవరీ చేశామని, వాటిని బాధితులకు అందజేస్తున్నట్లు తెలిపారు. మొబైల్స్ పోయిన వెంటనే CEIR పోర్టల్ ద్వారా లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు.