News May 16, 2024

ASF: ఇంటర్ పరీక్ష ఫీజు గడువు పెంపు 

image

ఆసిఫాబాద్ జిల్లాలో ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్ష రాసే విద్యార్థులకు రూ.1000 అపరాధ రుసుముతో 16వ తారీకు వరకు గడువు పెంచినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి శంకర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించారు.

Similar News

News January 24, 2025

అర్హులందరికీ సంక్షేమ పథకాలు: ADB కలెక్టర్

image

అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతాయని, లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ రాజార్షిషా అన్నారు. బజార్హత్నూర్ మండలం జాతర్లలో నిర్వహించిన  ప్రజాపాలన గ్రామసభలో గురువారం కలెక్టర్ పాల్గొన్నారు. లబ్ధిదారులు అందిస్తున్న దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. మండల ప్రత్యేక అధికారి మోహన్ సింగ్, తహశీల్దార్ శంకర్, మండల వ్యవసాయ అధికారి మహమ్మద్ సౌద్ తదితరులున్నారు.

News January 23, 2025

ఆదిలాబాద్‌లో నేటి పత్తి ధరల వివరాలు

image

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్లో గురువారం క్వింటాల్ సీసీఐ పత్తి ధర రూ.7,421గా, ప్రైవేట్ పత్తి ధర రూ.7,020గా నిర్ణయించారు. బుధవారం ధరతో పోలిస్తే గురువారం సీసీఐ ధరలో ఎలాంటి మార్పులేదు. ప్రైవేట్ పత్తి ధర రూ.80 తగ్గినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు వెల్లడించారు.

News January 22, 2025

MNCL:మల్టీ లెవెల్ స్కీమ్స్‌తో అప్రమత్తంగా ఉండాలి:CP

image

మల్టీ లెవెల్ స్కీమ్స్‌తో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనరేట్ సీపీ శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రకటన పట్ల ఆకర్షితులై మోసపోవద్దని హెచ్చరించారు. అనేక స్కీములతో బురిడీ కొట్టిస్తున్నారని తెలిపారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడితే 1930 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. స్థానిక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లను ఆశ్రయించాలని పేర్కొన్నారు.