News March 16, 2025
ASF: గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఆసిఫాబాద్ జిల్లాలోని మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలల్లో 6వ, 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల కోసం దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కన్వీనర్ శ్వేత తెలిపారు. విద్యార్థులు మార్చి 31 లోగా దరఖాస్తు చేసుకోవాలని, ఏప్రిల్ 15 నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చని, ఏప్రిల్ 20న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. మరింత సమాచారం కోసం https://mjptbcwreis.telangana.gov.in వెబ్ సైట్‌ను సందర్శించాలని సూచించారు.
Similar News
News March 16, 2025
పెనుబల్లి: మేక పంచాయితీ.. దాడి, ఫిర్యాదు.!

మేక తెచ్చిన పంచాయితీలో యువకుడికి తీవ్ర గాయాలైన ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో శనివారం చోటుచేసుకుంది. మండలానికి చెందిన కొందరు యువకులు కారులో టేకులపల్లి సాగర్ కాల్వ వద్ద ఈత కొడుతుండగా, అటుగా వచ్చిన మేకల గుంపులోని ఓ మేక కారుపై ఎక్కడంతో, పశువులు కాపరిని యువకులు కొట్టారు. అది గమనించిన స్థానికులు యువకులను కొట్టడంతో మారేష్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. యువకులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
News March 16, 2025
భువనగిరి: రోడ్డు దాటుతుండగా ప్రమాదం.. మహిళ మృతి

భువనగిరి శివారు రాయగిరి నేషనల్ హైవే 163పై రోడ్డు ప్రమాదం జరిగింది. తల్లీకూతుర్లు రోడ్డు దాటుతుండగా బైక్ ఢీకొని తల్లి అక్కడికక్కడే మృతి చెందగా, కూతురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
News March 16, 2025
కర్నూలు జిల్లాలో చికెన్ ధరలు

కర్నూలు జిల్లాలో చికెన్ ధరలు ఆదివారం ఈ విధంగా ఉన్నాయి. కర్నూలు, ఎమ్మిగనూరులో కిలో స్కిన్ రూ.160, స్కిన్ లెస్ రూ.180కి అమ్ముతున్నారు. ఆదోనిలో స్కిన్ లెస్ రూ.185, స్కిన్ రూ.160కి విక్రయాలు జరిగుతున్నాయి. మిగిలిన పట్టణాల్లోనూ ఇవే రేట్లు పలుకుతున్నాయి.