News April 18, 2025

ASF జిల్లాలో 8 మందిపై కేసు: వాంకిడి SI

image

మహారాష్ట్ర నుంచి రాజురాంపల్లికు పశువులను అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఎస్సై ప్రశాంత్ తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు వాంకిడి మండలం అకిని సమీపంలో బుధవారం తనిఖీలు నిర్వహించగా అనుమతులు లేకుండా 4 బులెరో వాహనాల్లో 8 పశువులను తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. పశువులను కాగజ్‌నగర్ గోశాలకు తరలించామన్నారు. 8 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రశాంత్ పేర్కొన్నారు.

Similar News

News December 21, 2025

ములుగు: ప్రైవేట్ డీలర్ల “యూరియా “దోపిడి

image

జిల్లాలో ప్రైవేటు డీలర్ల యూరియా దోపిడీ గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతుంది. ప్రభుత్వం ఫెర్టిలైజర్ యాప్ బుకింగ్ ద్వారా మాత్రమే యూరియా సరఫరా చేస్తామని ప్రకటించడంతో ఫెర్టిలైజర్ యజమానులు తమ వద్ద ఉన్న నిల్వలను అధిక ధరలకు రైతులకు విక్రయిస్తున్నారు. ఒక బస్తాకు రూ.350 నుంచి రూ.400 వరకు ఇతర క్రిమిసంహారక మందులను లింకుతో రైతులకు అంటగడుతున్నారు. ఈసారి కూడా యూరియా కొరత తప్పదనే అపోహలతో ఈ పరిస్థితి నెలకొంది.

News December 21, 2025

KNR: డబుల్‌ ఇళ్ల పంపిణీలో ‘చేతివాటం’

image

KNR నియోజకవర్గంలో 660 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు పూర్తయి పంపకానికి సిద్ధంగా ఉన్నాయి. లబ్ధిదారుల ఎంపికలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. KNRలో 60 డివిజన్లకు కేవలం 300 ఇళ్లు కేటాయించి, మిగిలిన 360 ఇళ్లను అధికార పార్టీ నేతలు తమ గుప్పిట్లో ఉంచుకున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అధికారులు స్పందించి అర్హులకు న్యాయం చేయాలని మాజీ కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు.

News December 21, 2025

రేపు మంత్రులతో సీఎం రేవంత్ సమావేశం

image

TG: సీఎం రేవంత్ రేపు HYDలోని ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మంత్రులతో సమావేశం కానున్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు, పంచాయతీ ఎన్నికల ఫలితాలు, పరిషత్ ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల పెంపు, గ్లోబల్ సమ్మిట్‌లో జరిగిన ఒప్పందాలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీ, కార్పొరేషన్ ఛైర్మన్ల నియామకం తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఈ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొంది.