News April 4, 2025

ASF: డిగ్రీ విద్యార్థులకు GOOD NEWS

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లింపు గడువును KU అధికారులు పొడిగించిన విషయం తెలిసిందే. కాగా వీటితో పాటు 1, 3, 5 సెమిస్టర్ పరీక్షలు సైతం రాసేందుకు అవకాశం కల్పించినట్లు KU అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో 1, 3, 5 పరీక్ష ఫీజును ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈనెల 11 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News April 18, 2025

తిర్యాణి: ‘శాంతి భద్రతల పరిరక్షణకే కార్డన్‌ సెర్చ్‌’

image

ASF జిల్లాలో నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ కోసం SP డీవీ శ్రీనివాస్ రావు ఆదేశానుసారం కార్డన్‌ సెర్చ్‌ నిర్వహిస్తున్నట్లు రెబ్బెన సీఐ బుద్ధస్వామి వెల్లడించారు. నాయకపుగూడలో ఎస్సై శ్రీకాంత్‌తో కలిసి కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించినట్లు తెలిపారు. సరైన ధృవపత్రాలు లేని 12 వాహనాలను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. గుడుంబా, గంజాయి విక్రయాలు కార్యక్రమాలు చేయొద్దని గ్రామస్థులకు సూచించారు.

News April 18, 2025

మెలోనీ అంటే నాకు చాలా ఇష్టం: ట్రంప్

image

ఇటలీ PM జార్జియా మెలోనీ అంటే తనకు చాలా ఇష్టమని ట్రంప్ తెలిపారు. ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. మెలోనీ గొప్ప ప్రధాని అని, వ్యక్తిగతంగానూ ఆవిడతో మంచి అనుబంధం ఉందన్నారు. ఆవిడలో చాలా ప్రతిభ ఉందని, ప్రపంచంలోని గొప్ప నేతల్లో ఒకరంటూ కొనియాడారు. టారిఫ్స్ పెంపుపై US వైఖరిని మెలోనీ వ్యతిరేకించినా.. యూరోపియన్ దేశాల నుంచి ట్రంప్‌ని కలిసిన తొలి ప్రధాని ఆవిడే.

News April 18, 2025

నక్కపల్లి: బైక్ నుంచి జారిపడి మహిళ మృతి

image

నక్కపల్లి మండలం కాగిత సమీపంలో జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం చెందింది. మునగపాక మండలం ఒంపోలుకు చెందిన దిమిలి వెంకటలక్ష్మి తన కుమారుడితో కలిసి కాకినాడ జిల్లా కత్తిపూడి వెళ్లింది. తిరుగు ప్రయాణంలో కాగిత సమీపంలో తన కుమారుడు వేగంగా బైక్ నడపడంతో అదుపుతప్పి వెనక కూర్చున్న వెంకటలక్ష్మి జారి కింద పడింది. ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేశారు.

error: Content is protected !!