News April 21, 2025
ASF: తల్లి, భార్య మందలించిందని సూసైడ్

మద్యం తాగొద్దని తల్లి, భార్య మందలించడంతో వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన వాంకిడి మండలంలో చోటు చేసుకుంది. వాంకిడి ఎస్సై ప్రశాంత్ కథనం ప్రకారం.. ఇందాని గ్రామానికి చెందిన లచ్చుంబాయి చిన్న కుమారుడు సంతోశ్ మద్యానికి బానిసయ్యాడు. తల్లి, భార్య కల్పన మందలించడంతో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News April 21, 2025
వీణవంక: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఐలాబాద్‌లో ఇవాళ ఆటో, బైక్ <<16165881>>ఢీకొన్న<<>> విషయం తెలిసిందే. అయితే ఆటో, బైక్ ఢీ కొనడంతో కరీంనగర్‌కు చెందిన పేపర్ ఆటో నడిపే నాగరాజు మృతి చెందగా, బైక్‌పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు అయినట్లు స్థానికులు పేర్కొన్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News April 21, 2025
మతోన్మాద పార్టీతో INC, BRS దోస్తీనా?.. కిషన్ రెడ్డి మండిపాటు

TG: HYD స్థానిక సంస్థల MLC ఎన్నికల్లో MIMకు మేలు చేసేలా INC, BRS వ్యవహరిస్తున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. మజ్లీస్ పచ్చి మతోన్మాద, రజాకార్ల పార్టీ అని దుయ్యబట్టారు. అలాంటి పార్టీతో కాంగ్రెస్‌కు దోస్తీనా అని నిలదీశారు. మజ్లీస్‌ను గెలిపించాలని సొంత పార్టీ కార్పొరేటర్లను BRS బెదిరిస్తోందని మండిపడ్డారు. BRSకు బాస్ KCR అయినా సూపర్ బాస్ అసదుద్దీన్ ఒవైసీ అని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
News April 21, 2025
ప్యాదిండిలో 2 బైకులు.. కారు ఢీ

చెన్నై కొత్తపల్లి మండలం ప్యాదిండి గ్రామం వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఒక కారు ఢీకొన్నాయి. దీంతో రామగిరి మండలం శ్రీహరిపురం గ్రామానికి చెందిన సాయి చనిపోయాడు. ప్యాదిండి గ్రామానికి చెందిన రమేశ్‌కి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం గాయపడిన రమేశ్‌ను చికిత్సకు ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.