News April 6, 2025

ASF: బాల రాముడు సూపర్

image

ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండల కేంద్రంలో శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ఓ చిన్నారి శ్రీరాముని వేషాధారణలో పలువురిని ఆకట్టుకుంది. మండలం దర్గపల్లి గ్రామానికి చెందిన జెట్టి శ్రీకాంత్-రమాదేవి దంపతుల కుమార్తె జెట్టి గనిష్క రాముడి వేషధారణలో అందరిని అలరించింది. చిన్ననాటి నుంచి దేవుడి వేషాధరణలో ఆధ్యాత్మిక చింతన పెంపొందించడం శుభప్రదమని పలువురు అభిప్రాయపడ్డారు.

Similar News

News April 17, 2025

వేములవాడ: రాజన్న ఆలయ విస్తీర్ణ పనుల కోసం సమావేశం

image

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి గురువారం రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ చేరుకున్నారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తీర్ణ పనుల కోసం ఆలయ గెస్ట్ హౌస్‌లో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. వేములవాడకు చేరుకున్న శైలజ రామయ్యకు కలెక్టర్ సందీప్ కుమార్‌ ఝా స్వాగతం పలికారు.

News April 17, 2025

WEF జాబితాలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

image

కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వరల్డ్ ఎకనామిక్ ఫోరం జాబితాలో చోటు సంపాదించుకున్నారు. దాదాపు 50కి పైగా దేశాలకు చెందిన 116మందికి యంగ్ గ్లోబల్ లీడర్స్‌గా WEF చోటు కల్పించింది. భారత్ నుంచి మెుత్తంగా ఏడుగురు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన 40 సంవత్సరాలలోపు వ్యక్తులను యంగ్ గ్లోబల్ లీడర్స్‌గా WEF గుర్తిస్తుంది.

News April 17, 2025

ONE DAY TOUR: మన అనంతగిరి ది బెస్ట్

image

వారంలో ఒక్కరోజైనా రిలాక్స్ అవ్వాలని అనుకుంటున్నారా? అయితే, అనంతగిరి హిల్స్ బెస్ట్ ప్లేస్. వీకెండ్ వచ్చిందంటే చాలు HYD, కర్ణాటక నుంచి వందలాది మంది టూరిస్టులు ఇక్కడికి క్యూ కడతారు. చుట్టూ పచ్చని కొండలు, అనంత పద్మనాభ స్వామి టెంపుల్, మూసీ నది పుట్టుక ఈ అడవుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ టూర్ వెళ్లాలంటే వరుసగా లీవ్‌లు పెట్టే అవసరం లేదు. ఒక్కరోజులోనే అనంతగిరిని చుట్టిరావొచ్చు.
SHARE IT

error: Content is protected !!