News April 7, 2025
ASF: సోలార్ తీగలు తగిలి రైతులు మృతి

సొలార్ విద్యుత్ తీగలు తగిలి రైతు మృతి చెందిన ఘటన ఆసిఫాబాద్ మండలంలో చోటు చేసుకుంది. ఆసిఫాబాద్ సీఐ రవీందర్ వివరాల ప్రకారం.. ఇప్పల్ నవేగాంకి చెందిన నీకోరె బాపూజీ శనివారం రాత్రి తన అన్న ఎడ్లు ఇంటికి రాకపోవడంతో వెతకడానికి వెళ్లాడు. తెల్లారేసరికి ఇంటికి రాకపోవడంతో ఆదివారం రాథోడ్ వివేక్ పొలం పక్కనున్న కెనాల్‌లో ఏర్పాటుచేసిన సొలార్ తీగలకు తగిలి మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News April 17, 2025
ఖమ్మం: ఇద్దరు పిల్లలను నరికి తల్లి SUICIDE

హైదరాబాద్ జీడిమెట్ల PS పరిధిలో దారుణం జరిగింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన వివాహిత తేజ(30) గాజులరామారంలో ఉంటుంది. వేట కొడవలితో ఇద్దరు కొడుకులను నరికి, ఆనక తల్లి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ తగాదాల నేపథ్యంలో 7, 5 ఏళ్ల పిల్లలను కిరాతకంగా నరికి చంపిందని స్థానికులు అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలు పోలీసులు నిర్ధారించాల్సి ఉంది.
News April 17, 2025
కర్నూలు: సీనియర్ సిటిజన్ ఐడీకి ఆన్‌లైన్ దరఖాస్తులు

జిల్లా వయోవృద్ధులకు సీనియర్ సిటిజన్ ఐడీ కార్డు కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వయో వృద్ధుల సంక్షేమశాఖ అధికారి రయిస్ ఫాతిమా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 60 ఏళ్లు పైబడిన పురుషులు, 58 ఏళ్లు పైబడిన మహిళలు సీనియర్ సిటిజన్లు అర్హులన్నారు. ఈ రిజిస్ట్రేషన్ కోసం ఆధార్, పాసుపోర్టు సైజు ఫొటోతో వార్డు, గ్రామ సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News April 17, 2025
భూభారతిపై మేడ్చల్ కలెక్టర్ సమావేశం

ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టం ద్వారా భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్ గౌతం అన్నారు. కలెక్టరేట్‌లో భూభారతిపై తహాశీల్దార్లు, జిల్లా రెవెన్యూ అధికారులకు అవగాహన కల్పించేందుకు అదనపు కలెక్టరు విజయేంధర్ రెడ్డితో కలిసి సమావేశమయ్యారు.