News December 9, 2024

ఆశా వర్కర్లపై పురుష పోలీసులతో దౌర్జన్యమా?: కేటీఆర్

image

TG: ఇందిరమ్మ రాజ్యమంటే అణచివేతలు, అక్రమ అరెస్టులేనా అని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. మాతృమూర్తులపై పురుష పోలీసులతో దౌర్జన్యమా? ఏం పాపం చేశారని వారిని రోడ్డుపైకి లాగారని మండిపడ్డారు. వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే వారి ఆగ్రహజ్వాలలను తట్టుకోలేరని హెచ్చరించారు.

Similar News

News December 9, 2025

7వేల రిజిస్ట్రేషన్లే పెండింగ్: మంత్రి నారాయణ

image

AP: రాజధాని రైతులకు ఇచ్చిన ప్లాట్లలో మౌలిక వసతుల పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ చెప్పారు. 66K ప్లాట్లలో 7K మాత్రమే రిజిస్ట్రేషన్లు చేయాల్సి ఉందన్నారు. త్వరలోనే ఈ ప్రక్రియ కూడా పూర్తవుతుందని, రైతులు ముందుకొచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. లంక భూములు, అసైన్డ్ భూముల సమస్యలను వచ్చే మంత్రివర్గ సమావేశంలో పరిష్కరిస్తామన్నారు. రాజధానిలో జరుగుతున్న పనులను ఆయన ఇవాళ పరిశీలించారు.

News December 9, 2025

పోస్టర్ రగడ.. ‘కుంభ’గా రేవంత్ రెడ్డి

image

TG: ‘వారణాసి’ సినిమాలోని విలన్(కుంభ) పాత్రలో CM రేవంత్‌ ఉన్నట్లుగా పోస్టర్ క్రియేట్ చేసిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే దీనిని తాజాగా BJP షేర్ చేయడం వివాదానికి ఆజ్యం పోసినట్లైంది. భారతదేశంలో ఎమర్జెన్సీ మైండ్‌సెట్ ఇంకా సజీవంగానే ఉందని మండిపడింది. రేవంత్ ప్రభుత్వం నియంతృత్వ వైఖరి అవలంబిస్తోందని, అవినీతి పాలన కొనసాగిస్తోందని X వేదికగా బీజేపీ విమర్శలు గుప్పించింది.

News December 9, 2025

‘ఇండిగో’ సంస్థకు షాక్ ఇచ్చిన కేంద్రం

image

దేశవ్యాప్తంగా వందలాది విమానాల రద్దు, ఆలస్యంపై విమానయాన సంస్థ ఇండిగోకు కేంద్రం గట్టి హెచ్చరిక జారీ చేసింది. ఇండిగోకు ఉన్న స్లాట్లలో 5% కోత విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో రోజూ నడిచే సర్వీసులు కనీసం 110 వరకు తగ్గే అవకాశముంది. తగ్గించిన స్లాట్లు ఎయిర్ ఇండియా, ఆకాశ, స్పైస్‌జెట్ వంటి సంస్థలకు కేటాయించనున్నారు. ప్రయాణికుల అసౌకర్యం తగ్గించేందుకు ఈ చర్యలు కీలకమని DGCA పేర్కొంది.