News October 24, 2024

అశ్విన్ సూచనలతోనే 7 వికెట్లు తీయగలిగా: వాషింగ్టన్

image

న్యూజిలాండ్‌పై తాను 7 వికెట్లు తీయడం వెనుక తన తోటి స్పిన్నర్ అశ్విన్ ఇచ్చిన సూచనలు కీలకమయ్యాయని వాషింగ్టన్ సుందర్ తెలిపారు. ‘బాల్ బాగా సాఫ్ట్‌గా మారడంతో వికెట్ల కోసం బంతిని వేగంగా విసరాలని అశ్విన్ సూచించారు. ఆ టెక్నిక్‌తోనే కాన్వేను ఆయన ఔట్ చేశారు. ఆ సూచన పాటించడంతో పాటు సరైన ప్రాంతాల్లో బంతిని వేయడం ద్వారా వికెట్లు తీయగలిగాను. అశ్విన్‌తో కలిసి మరిన్ని మ్యాచులు ఆడాలనుకుంటున్నాను’ అని వివరించారు.

Similar News

News October 24, 2024

‘పింక్ ఆటోలు’.. ఆలోచన బాగుంది కదా!

image

మహిళల భద్రత, స్వయం ఉపాధి కోసం తమిళనాడు ప్రభుత్వం ‘పింక్ ఆటోరిక్షాల’ స్కీం తీసుకొచ్చింది. CNG లేదా హైబ్రిడ్ ఆటోలు కొనుగోలు చేసేందుకు 250 మంది ఒంటరి, నిరుపేద మహిళలకు రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తుంది. మిగతా మొత్తం తక్కువ వడ్డీకి లోన్ రూపంలో అందిస్తుంది. అందులో జీపీఎస్ ఉండటం వల్ల డ్రైవర్లకు, ప్రయాణికులకు భద్రత ఉంటుంది. ఇతర రాష్ట్రాల్లోనూ ఈ పథకం తీసుకొస్తే బాగుంటుంది కదూ..!

News October 24, 2024

‘పుష్ప-2’కు బన్నీకి రెమ్యూనరేషన్ ఎన్ని కోట్లంటే?

image

పుష్ప-2 కు అల్లు అర్జున్ భారీ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. రూ.100 కోట్లు తీసుకున్నారని కొన్ని కథనాలు పేర్కొన్నాయి. అయితే మూడేళ్ల కాలాన్ని ఈ సినిమాకే వెచ్చించడంతో రూ.200 కోట్లకుపైగా తీసుకుంటారని మరికొన్ని తెలిపాయి. లేదంటే సినిమా కలెక్షన్లలో 27శాతం ప్రాఫిట్ తీసుకునేలా ఒప్పందం చేసుకున్నారని సమాచారం. కాగా ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్లలో విడుదల కానుంది.

News October 24, 2024

Meta, X స‌హ‌కారం కోరిన కేంద్ర ప్ర‌భుత్వం

image

విమానాలకు న‌కిలీ బాంబు బెదిరింపులు అధిక‌మ‌వ్వ‌డంతో వీటి క‌ట్ట‌డిలో స‌హ‌క‌రించాలని X, Meta సంస్థ‌ల‌ను కేంద్రం కోరింది. ఈ వేదిక‌ల మీద వ‌స్తున్న బెదిరింపు కాల్స్‌, సందేశాల వెనుక ఉన్న‌వారిని గుర్తించేందుకు అవ‌స‌ర‌మైన డేటాను త‌మ‌తో పంచుకోవాల‌ని కోరింది. దేశ ప్ర‌జ‌ల శ్రేయ‌స్సుతో ముడిప‌డిన అంశం కారణంగా 2 సంస్థ‌లు స‌హ‌క‌రించాల్సి ఉంద‌ని ఓ అధికారి తెలిపారు. 9 రోజుల్లో 170 విమానాలకు బెదిరింపులు వచ్చాయి.