News June 20, 2024

అశ్వినీ దత్ కాళ్లు మొక్కిన బిగ్ బీ.. RGV రియాక్షన్ ఇదే

image

‘కల్కి’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నిర్మాత అశ్వినీ దత్ కాళ్లకు నమస్కరించారు. దీనిపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ‘అమితాబ్ బచ్చన్ ఇలా చేయడం అశ్వినీదత్ సాధించిన విజయాల్లో అత్యున్నతం. NTR నుంచి తాజా యువ హీరోల వరకు ఎవరూ ఇలా చేసి ఉండరు. బిగ్ బీ తన కెరీర్ మొత్తంలో మరే ఇతర నిర్మాతకు ఇలా చేయడం నేను చూడలేదు’ అని ట్వీట్ చేశారు.

Similar News

News October 27, 2025

70 రకాల సొంత విత్తనాలతో సేంద్రియ సేద్యం

image

30 ఏళ్లుగా సేంద్రియ సేద్యం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు సంగారెడ్డి జిల్లా బిడెకన్నకు చెందిన రైతు చిన్న చంద్రమ్మ. విత్తనాలు, ఎరువుల కోసం ఇతరులపై ఆధారపడకుండా తెలంగాణ డీడీఎస్ KVKతో కలిసి 70కి పైగా విభిన్న విత్తనాలను నిల్వ చేసి వాటినే సాగు చేస్తూ, ఇతర రైతులకు అందిస్తున్నారు. సాగు, రైతులపై పాటలు కూర్చి రేడియోలో పాడి స్ఫూర్తి నింపుతున్నారు.☛ రోజూ అగ్రికల్చర్ కంటెంట్ కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.

News October 27, 2025

బాలీవుడ్ యువ నటుడి ఆత్మహత్య

image

బాలీవుడ్ యువ నటుడు సచిన్ చాంద్‌వడే (25) ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని జల్గావ్‌లో తన ఇంట్లో ఈనెల 23న ఆయన ఉరి వేసుకున్నారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. తర్వాత మరో ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ ఈ నెల 24న చనిపోయారు. ‘జంతారా సీజన్2’తో సచిన్ ఫేమస్ అయ్యారు. ఆయన నటిస్తున్న ‘అసుర్వన్’ మూవీ షూటింగ్ ఇటీవల మొదలైంది. సూసైడ్‌కు కారణాలు తెలియాల్సి ఉంది.

News October 27, 2025

రెండో దశలో 12 చోట్ల SIR నిర్వహణ: CEC

image

తొలి దశ SIR(సమగ్ర ఓటర్ జాబితా సవరణ) బిహార్‌లో విజయవంతమైనట్లు CEC జ్ఞానేశ్ కుమార్ వెల్లడించారు. రెండో దశలో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నిర్వహించినట్లు చెప్పారు. దేశంలో ఇప్పటివరకు 1951-2004 మధ్య కాలంలో 8 సార్లు SIR జరిగినట్లు వెల్లడించారు. చివరగా 21 ఏళ్ల క్రితం ఈ ప్రక్రియ నిర్వహించినట్లు పేర్కొన్నారు. నకిలీ ఓటర్లను అరికట్టి, అసలైన ఓటర్లను గుర్తించేందుకే ఈ ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు.