News September 23, 2025

ASIA CUP: ఇవాళ రెండు జట్లకు చావోరేవో

image

సూపర్‌-4లో భాగంగా ఇవాళ 8PMకు పాక్, శ్రీలంక తలపడనున్నాయి. ఇరు దేశాలకు ఇది చావోరేవో మ్యాచ్. ఇప్పటికే బంగ్లాదేశ్ చేతిలో శ్రీలంక, ఇండియా చేతిలో పాక్ ఓడిపోయాయి. దీంతో ఇవాళ ఓడిన జట్టు దాదాపు టోర్నీ నుంచి నిష్క్రమించినట్లే. గెలిచిన జట్టు తమ చివరి మ్యాచ్‌లోనూ విజయం సాధిస్తే ఫైనల్‌కు వెళ్తుంది. మరోవైపు రేపు బంగ్లాను భారత్ ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమ్ నేరుగా తుది పోరుకు అర్హత సాధిస్తుంది.

Similar News

News September 23, 2025

బ్లూ ఎడ్జ్ ఆఫ్ ఐటీ అండ్ ఇన్నోవేషన్‌గా విశాఖ: కాటమనేని

image

విశాఖను ప్రపంచ స్థాయి ఐటీ, ఇన్నోవేషన్ కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఈ-గవర్నెన్స్ కాన్ఫరెన్స్‌లో వక్తలు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం విశాఖలో విప్రో, టెక్ మహీంద్రా, కాగ్నిజెంట్, అదానీ, ఇన్ఫోసిస్, మౌరి టెక్ వంటి కంపెనీలు పనిచేస్తున్నాయని రాష్ట్ర ITE&C కార్యదర్శి కటామనేని భాస్కర్ తెలిపారు. విశాఖను ‘బ్లూ ఎడ్జ్ ఆఫ్ ఐటీ అండ్ ఇన్నోవేషన్’గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని కటంనేని స్పష్టం చేశారు.

News September 23, 2025

మరో 2 గంటల్లో వర్షం

image

తెలంగాణలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. నిన్న <<17794672>>హైదరాబాద్<<>> సహా పలు జిల్లాల్లో వాన దంచికొట్టిన విషయం తెలిసిందే. ఇవాళ కూడా కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తెలిపింది. మేడ్చల్, వరంగల్, ఆదిలాబాద్, హన్మకొండ, మహబూబాబాద్, నిర్మల్, సూర్యాపేట జిల్లాల్లో రాబోయే 2 గంటల్లో మోస్తరు వాన పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. మీ ఏరియాలో వాతావరణం ఎలా ఉందో కామెంట్ చేయండి.

News September 23, 2025

ఈనెల 26 వరకు వర్షాలే వర్షాలు!

image

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. గతంలో మాదిరి కాకుండా క్లౌడ్ బరస్ట్ తరహాలో వానలు పడుతున్నాయి. అయితే ఈ వర్షాలు ఇప్పట్లో వీడే అవకాశం లేదని APSDMA తెలిపింది. పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో ఈనెల 26న వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో AP, TGలో మరో 3(26 వరకు) రోజులు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.