News August 14, 2025
Asia Cup: SKY లేకుండానే భారత జట్టు?

ఆసియా కప్‌లో పాల్గొనే భారత జట్టును మరో వారంలో ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ జపాన్ పర్యటనకు వెళ్లడం పలు సందేహాలకు తావిస్తోంది. ఆయన జపాన్‌కు వ్యక్తిగత పనులపై వెళ్లారా? లేదా ఏదైనా గాయానికి చికిత్స తీసుకునేందుకు వెళ్లారా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో స్కై లేకుండానే ఆసియా కప్‌కు BCCI జట్టును ప్రకటిస్తుందనీ వార్తలొస్తున్నాయి.
Similar News
News August 14, 2025
ALERT: కాసేపట్లో వర్షం

TG: మరికాసేపట్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 1-2 గంటల్లో సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, మేడ్చల్, భువనగిరి, జనగామ, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో భారీ వాన పడుతుందని అంచనా వేసింది. అలాగే రాబోయే 2 గంటల్లో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
News August 14, 2025
ఈ నెల 18న శ్రీవారి ఆర్జిత టికెట్ల కోటా రిలీజ్

AP: నవంబర్ నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఈ నెల 18న ఉ.10గంటలకు విడుదల చేయనున్నట్లు TTD తెలిపింది. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లు ఈ నెల 21న ఉ.10గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. 23న ఉ.10గంటలకు అంగప్రదక్షిణ, 11గంటలకు శ్రీవాణి ట్రస్టు టోకెన్ల కోటా, 25న ఉ.10గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తున్నట్లు పేర్కొంది.
News August 14, 2025
DSC స్పోర్ట్స్ కోటా పోస్టుల పేరుతో మోసం.. జాగ్రత్త!

AP: స్పోర్ట్స్ కోటా కింద ఎలాంటి పరీక్ష లేకుండా నేరుగా 421 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం 5,326 అప్లికేషన్స్ రాగా, 1200 మంది 1:5 రేషియోలో షార్ట్ లిస్ట్ అయ్యారు. ఈ క్రమంలో శాప్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నామంటూ అభ్యర్థులను డబ్బులు అడుగుతున్నారని జరుగుతున్న ప్రచారంపై అధికారులు స్పందించారు. శాప్ నుంచి అలా ఎవరూ కాల్ చేసి డబ్బులు అడగలేదని స్పష్టం చేశారు. ఆశపడి డబ్బులు పంపి మోసపోవద్దని సూచించారు.