News October 2, 2025

ASIA CUP: ట్రోఫీని UAE బోర్డుకు అప్పగించిన నఖ్వీ!

image

ASIA కప్ ట్రోఫీ, మెడల్స్‌ను IND జట్టుకు అందించకుండా PCB ఛైర్మన్ నఖ్వీ తీసుకెళ్లిన విషయం తెలిసిందే. దీనిపై BCCI ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ACC సమావేశంలో ఘాటుగా స్పందించింది. దీంతో నఖ్వీ కప్, మెడల్స్‌ను UAE బోర్డుకు అప్పగించినట్లు తెలుస్తోంది. అయితే, వాటిని భారత ప్లేయర్లకు ఏ విధంగా అందిస్తారనేది తెలియాల్సి ఉంది. అటు తాను BCCIకి సారీ చెప్పినట్లు వస్తున్న వార్తలను నఖ్వీ ఖండించినట్లు సమాచారం.

Similar News

News February 11, 2026

జగమంతా శివతత్వం

image

శివతత్వం అంటే కేవలం ఒక రూపం మాత్రమే కాదు. అది అంతటా నిండి ఉన్న అనంతమైన చైతన్యం. సృష్టిలోని ప్రతి అణువులోనూ, ప్రకృతిలోని ప్రతి మార్పులోనూ శివుడు ఉన్నాడు. కనిపించే పర్వతాలు, ఆకాశం నుంచి మనలో కలిగే ఆలోచనలు, కలల వరకు అన్నీ ఆ శివమయమే. శివం కానిది ఈ విశ్వంలో ఏదీ లేదు. మన ఊహకు అందేదీ ఆయనే! ఆ ఊహ చేసేదీ ఆయనే! శివతత్వం అంటే మౌనం, శూన్యం, సమస్తం. జగమంతా శివతత్వమే.

News February 11, 2026

విశాఖలో IPL మ్యాచులు?

image

IPL–2026లో విశాఖ వేదిక ఉండనున్నట్లు తెలుస్తోంది. ACA–VDCA స్టేడియంలో కనీసం రెండు మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఈ వేదికను హోం గ్రౌండ్‌గా ఉపయోగించుకున్న సంగతి తెలిసిందే. ఈ వేదిక DCకి కలిసి రాగా ఈ ఏడాది కూడా మ్యాచుల నిర్వహణకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ విషయమై ఆంధ్ర క్రికెట్ సంఘం DCని సంప్రదించగా ఆసక్తి కనబరిచినట్లు తెలుస్తోంది.

News February 11, 2026

ఇక్కడ స్నానం చేస్తే పాపాలు పోతాయట

image

ఒడిశాలోని బింకా సమీపంలో మహానది తీరాన ఉన్న పాపాక్షయ ఘాట్‌కు 900 ఏళ్ల చరిత్ర ఉంది. బ్రాహ్మణ హత్య దోషంతో బాధపడిన అనంగ భీమదేవుడు ఇక్కడ స్నానం చేసి విముక్తి పొందాడని కథనం. ఓ ఆవు స్వయంగా పాలిచ్చిన చోట రాజు కపిలేశ్వర శివాలయాన్ని నిర్మించాడు. ఇక్కడి మహానదిలో స్నానం చేసి, శివుడిని దర్శించుకుంటే పాపాలు తొలగి మనశ్శాంతి కలుగుతుందని విశ్వాసం. ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ఉండే ఈ ఘాట్‌కు ఏటా ఎంతో మంది వస్తుంటారు.