News August 24, 2025
ఆసియా కప్.. భారత జట్టుకు కొత్త స్పాన్సర్?

కేంద్రం తీసుకొచ్చిన ఆన్‌లైన్ గేమింగ్ <<17477461>>చట్టంతో<<>> భారత క్రికెట్ జట్టు స్పాన్సర్‌షిప్ నుంచి డ్రీమ్ 11 వైదొలగడం దాదాపు ఖాయమైంది. ఇప్పటికే దీనిపై BCCI సెక్రటరీ సైకియా <<17485869>>స్పందిస్తూ<<>> కేంద్రం అనుమతి లేకపోతే స్పాన్సర్‌ను తొలగిస్తామని చెప్పారు. వచ్చే నెల 9 నుంచి ఆసియా కప్ జరగనున్న నేపథ్యంలో BCCI కొత్త స్పాన్సర్ కోసం చూస్తున్నట్లు తెలుస్తోంది. ఆసక్తి ఉన్న సంస్థలను త్వరలో బిడ్‌కు ఆహ్వానించనున్నట్లు సమాచారం.
Similar News
News August 24, 2025
త్వరలో RSS కీలక మీటింగ్.. వీటిపైనే చర్చ!

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS) వార్షిక సమావేశం SEP 5-7 వరకు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో జరగనుంది. RSS చీఫ్ మోహన్ భాగవత్ ఆధ్వర్యంలో జరిగే ఈ మీటింగ్‌కు BJP సహా ABVP, భారతీయ మజ్దూర్, కిసాన్ సంఘ్, స్వదేశీ జాగరణ్ మంచ్, వనవాసీ కళ్యాణ్, సేవా సమితి తదితర అనుబంధ సంఘాల ప్రతినిధులు హాజరుకానున్నారు. BJP తదుపరి చీఫ్ ఎన్నికతో పాటు US టారిఫ్స్ ఇతర సమకాలీన కీలక అంశాలపై చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది.
News August 24, 2025
GATE-2026 షెడ్యూల్‌లో మార్పు

M.Tech, PhD కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్(GATE-2026) షెడ్యూల్ మారింది. రేపటి నుంచి దరఖాస్తుల ప్రక్రియ స్టార్ట్ కావాల్సి ఉండగా పోస్ట్‌పోన్ అయింది. ఈనెల 28నుంచి అప్లికేషన్లు స్వీకరించనున్నట్లు అధికారిక <
News August 24, 2025
103 శాటిలైట్స్, చంద్రయాన్-8.. ఇస్రో ప్లాన్ ఇదే!

ఇస్రో ఫ్యూచర్ ప్లాన్‌పై స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ డైరెక్టర్ నీలేశ్ దేశాయ్ కీలక విషయాలు వెల్లడించారు. ‘2025-2040 వరకు భవిష్యత్ ప్రణాళిక సిద్ధం చేశాం. ఈ 15 ఏళ్లలో సెక్యూరిటీ, సర్వైలెన్స్, ఎర్త్ అబ్జర్వేషన్, ల్యాండ్, ఓషన్ అప్లికేషన్స్ తదితర 103 శాటిలైట్స్ లాంచ్ చేయనున్నాం. చంద్రయాన్-4,5,6,7,8 మిషన్స్ ప్లాన్ చేస్తున్నాం. బెస్ట్ స్పేస్ ఫెయిరింగ్ నేషన్‌గా భారత్ ఎదుగుతుంది’ అని వ్యాఖ్యానించారు.