News September 24, 2025

ఆసియా కప్: శ్రీలంక ఇంటికే..!

image

ఆసియా కప్‌ సూపర్-4లో రెండు మ్యాచుల్లో ఓటమితో శ్రీలంక ఫైనల్ ఆశలు దాదాపు గల్లంతయ్యాయి. ఆ జట్టు ఫైనల్ చేరాలంటే భారత్ తర్వాతి రెండు మ్యాచుల్లో భారీ తేడాతో ఓడాల్సి ఉంటుంది. ప్రస్తుతం సూర్య సేన ఫామ్‌ను చూస్తే అది అసాధ్యమే అని చెప్పొచ్చు. అటు రేపటి మ్యాచులో బంగ్లాదేశ్‌ పాక్‌ను ఓడించడంతో పాటు ఈ నెల 26న టీమ్ ఇండియాపై శ్రీలంక తప్పనిసరిగా గెలవాలి. ఇదంతా జరిగినా NRR ఆధారంగానే ఫైనలిస్టులు ఖరారు అవుతాయి.

Similar News

News September 24, 2025

వేధింపులకు చెక్ పెట్టాలంటే..

image

ప్రస్తుతకాలంలో చదువులు, ఉద్యోగం, ఉపాధి నిమిత్తం చాలామంది మహిళలు ఉన్న ఊరు వదిలి, అందరికీ దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో కొన్నిసార్లు ఆకతాయిల వేధింపులకు గురవుతుంటారు. వీరి కోసం ప్రభుత్వం కొన్ని టోల్‌ఫ్రీ నంబర్లు అందుబాటులోకి తెచ్చింది. గృహ హింస, వరకట్నం బాధితులైతే 181, మహిళల అక్రమరవాణా, లైంగిక వేధింపులపై 1091, చిన్నపిల్లలపై అఘాయిత్యాలు, వేధింపులకు సంబంధించి 1098 నంబర్లకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయొచ్చు.

News September 24, 2025

యువతిపై గ్యాంగ్ రేప్, మర్డర్.. సంచలన విషయాలు

image

HYDలో ‘నిర్భయ’ తరహా ఘటన జరిగింది. మద్యం మత్తులో నడుచుకుంటూ వెళ్తున్న యువతి(32)ని లంగర్‌హౌస్‌కు చెందిన ఆటో డ్రైవర్ దుర్గారెడ్డి రేప్ చేసి ఆరాంఘర్‌లో వదిలేసి వెళ్లాడు. తర్వాత ఆటో డ్రైవర్లు దస్తగిరి ఖాన్, ఇమ్రాన్ ఆమెను కిస్మత్‌పూర్ బ్రిడ్జి వద్దకు తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు. ప్రైవేట్ పార్ట్స్‌పై దాడి చేసి దారుణంగా హింసించి చంపారు. నగ్నంగా పడిఉన్న యువతి మృతదేహాన్ని ఈనెల 15న పోలీసులు గుర్తించారు.

News September 24, 2025

చదువుకునేందుకు వయసు అడ్డురాలేదు!

image

ఆ ఊరిలో పిల్లలతో పాటు వృద్ధులు కూడా భుజాన బ్యాగు ధరించి స్కూళ్లకు వెళ్తుంటారు. మహారాష్ట్ర, థానేలోని ఫంగానే గ్రామంలో ‘ఆజిబాయిచి శాల’ అనే పాఠశాల ఉంది. ఇక్కడ వృద్ధ మహిళలకు చదువు బోధిస్తారు. ఇలా ఒకప్పుడు అక్షరాలకు దూరమైన అవ్వల చేతులు ఇప్పుడు అక్షరాల లోకాన్ని తాకుతున్నాయి. ఓ వృద్ధురాలు పవిత్ర గ్రంథాలను చదవాలన్న కోరిక నుంచి పుట్టిన ఈ బడిలో ఇప్పుడు ఎంతోమంది రోజుకు రెండు గంటలు చదువు నేర్చుకుంటున్నారు.