News August 13, 2025
Asia Cup: వీరిలో చోటు దక్కేదెవరికి?

ఆసియా కప్ కోసం భారత జట్టును ఎంపిక చేసేందుకు BCCI మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్‌లలో ఎవరిని సెలక్ట్ చేయాలో తేల్చుకోలేకపోతున్నట్లు సమాచారం. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజూ ఉన్నారు. అలాగే వన్ డౌన్‌లో సూర్య, ఆ తర్వాత తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య ఉన్నారు. మరో స్థానం కోసం ఆ నలుగురి మధ్య పోటీ నెలకొంది. ఎవరిని సెలక్ట్ చేయాలో కామెంట్ చేయండి.
Similar News
News August 13, 2025
నవోదయ ప్రవేశాలకు దరఖాస్తు గడువు పెంపు

దేశ వ్యాప్తంగా 654 జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2026-27 విద్యాసంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఆగస్టు 27 వరకు పొడిగించారు. ఇవాళ్టితో గడువు ముగియనుండగా దాన్ని పెంచారు. ప్రస్తుతం 5వ క్లాస్ చదువుతున్న వారు దరఖాస్తు చేసేందుకు అర్హులు. APలో 15, TGలో 9 నవోదయ స్కూల్స్ ఉన్నాయి. DEC 13న పరీక్ష నిర్వహిస్తారు. 2026 మార్చిలో ఫలితాలను వెల్లడిస్తారు. దరఖాస్తు చేసేందుకు <
News August 13, 2025
చర్చలు విఫలం.. కొనసాగనున్న సినీ కార్మికుల సమ్మె

సినీ కార్మికుల వేతనాల పెంపుపై నిర్మాతలు, ఫిల్మ్ ఫెడరేషన్ మధ్య చర్చలు మరోసారి విఫలమయ్యాయి. దీంతో కార్మికుల సమ్మె కొనసాగనుంది. ‘షరతులతో కూడిన పని విధానాలకు కార్మికులు ఒప్పుకుంటే వేతనాలు పెంచేందుకు నిర్మాతలు రెడీగా ఉన్నారు. రూ.2,000 కంటే తక్కువ తీసుకునే వారికి ఒక విధానం, అంతకంటే ఎక్కువ తీసుకునే వారికి మరో విధానాన్ని ప్రతిపాదించాం. మరో 2, 3 సార్లు చర్చలు జరగాల్సి ఉంది’ అని దిల్ రాజు తెలిపారు.
News August 13, 2025
సుధీర్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

AP: వైసీపీ నేత, జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా తమ విధులకు ఆటంకం కలిగించారని యర్రగుంట్ల పీఎస్‌లో ఆయనపై కేసు నమోదు చేశారు. దీంతో నిడిజువ్విలోని ఆయన ఇంట్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు యర్రగుంట్ల స్టేషన్‌కు తరలించారు. అనంతరం జమ్మలమడుగు కోర్టులో హాజరుపరిచారు.