News September 24, 2025
ఆసియా కప్: గెలిస్తే ఫైనల్‌కే

ఆసియాకప్ 2025 సూపర్-4లో భాగంగా నేడు బంగ్లాదేశ్‌తో టీమ్‌ఇండియా తలపడనుంది. ఈ మ్యాచులో గెలిస్తే సూర్య సేన ఫైనల్ చేరనుంది. ఒకవేళ ఓడితే శ్రీలంకతో మ్యాచులో మెరుగైన RRతో గెలవాలి. బంగ్లాతో ఇప్పటివరకు 17 T20Iలు ఆడగా 16 మ్యాచుల్లో IND విజయం సాధించింది. అటు శ్రీలంకపై విజయంతో బంగ్లా జోరు మీద ఉంది. దుబాయ్ వేదికగా రా.8 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌ను సోనీ స్పోర్ట్స్ ఛానల్, సోనీ లివ్ యాప్‌లో లైవ్ చూడవచ్చు.
Similar News
News September 24, 2025
కుక్క గోరు గుచ్చుకుని యువకుడు మృతి

TG: పెంపుడు కుక్క గోరు గుచ్చుకుని యువకుడు మరణించిన ఘటన కొత్తగూడెం(D)లో జరిగింది. ఏడూళ్లబయ్యారానికి చెందిన సందీప్ (25) 2 నెలల క్రితం కుక్కపిల్లను ఇంటికి తెచ్చుకున్నాడు. మచ్చిక చేసుకుంటుండగా అది తన తండ్రిని కరిచింది. అదే సమయంలో కుక్క కాలి గోరు సందీప్‌కు గుచ్చుకుంది. తండ్రికి చికిత్స చేయించిన అతడు తన గాయాన్ని నిర్లక్ష్యం చేశాడు. ఇటీవల రేబీస్ లక్షణాలతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ సోమవారం చనిపోయాడు.
News September 24, 2025
CM చంద్రబాబుకు లీగల్ నోటీసులు పంపిన CI

AP: వివేకా హత్య కేసు సమయంలో పులివెందుల సీఐగా పనిచేసిన శంకరయ్య సీఎం చంద్రబాబుకు లీగల్ నోటీసులు పంపారు. తన సమక్షంలోనే నిందితులు హత్యకు సంబంధించిన ఆధారాలు ధ్వంసం చేశారని గతంలో చంద్రబాబు దురుద్దేశపూర్వకంగా ఆరోపణలు చేశారంటూ ఈనెల 18న CMకు నోటీసులు పంపించారు. అసెంబ్లీలో బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించినందుకు రూ.1.45 కోట్ల పరిహారం చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
News September 24, 2025
వచ్చే నెల నుంచి ధాన్యం కొనుగోళ్లు.. సమస్యలకు టోల్ ఫ్రీ నంబర్లు

TG: ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లను అక్టోబర్ తొలి వారం నుంచి ప్రారంభించాలని పౌరసరఫరాలశాఖ నిర్ణయించింది. అక్టోబర్ నుంచి జనవరి వరకు 74.99 లక్షల టన్నుల వడ్లను కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో తేమ, తరుగు, టార్పాలిన్లు, గన్నీ సంచుల్లో సమస్యలు ఎదురైతే రైతులు 1967, 180042500333 టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేయాలని అధికారులు సూచించారు.