News March 27, 2025
ఏషియన్ ఛాంపియన్షిప్స్.. భారత్‌కు మరో పతకం

జోర్డాన్ రాజధాని అమ్మాన్లో జరుగుతోన్న సీనియర్ ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్స్-2025లో భారత్‌కు మరో మెడల్ దక్కింది. 97 కేజీల విభాగంలో రెజ్లర్ నితేశ్ కాంస్య పతకం గెలుచుకున్నారు. దీంతో భారత్ పతకాల సంఖ్య 2కు చేరింది. నిన్న 87 కేజీల విభాగంలో సునీల్ కుమార్ బ్రాంజ్ మెడల్ గెలిచిన సంగతి తెలిసిందే. నితేశ్ గతంలో U23 ఏషియన్ ఛాంపియన్షిప్స్, U23 వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లోనూ పతకాలు సాధించారు.
Similar News
News March 30, 2025
నేడు పీ-4 కార్యక్రమం ప్రారంభం

AP: పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఇవాళ పీ-4 కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 20 శాతం మంది నిరుపేదలకు ఉన్నత స్థితిలో ఉన్న 10 శాతం మంది సహాయం చేసేందుకే దీనిని చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 14 వేల మంది పాల్గొంటారు. పేదలు, దాతలు, మంత్రులు, ప్రముఖులు హాజరు కానున్నారు.
News March 30, 2025
సౌతాఫ్రికాలో డ్రైవింగ్ అత్యంత ప్రమాదకరం

వాహన డ్రైవింగ్ విషయంలో సౌతాఫ్రికా ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశంగా నిలిచింది. అవినీతి అధికారుల వల్లే ఈ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. యూఎస్‌కు చెందిన జుటోబీ వార్షిక నివేదిక విడుదల చేసిన ఈ జాబితాలో భారత్ ఐదో స్థానంలో నిలిచింది. అలాగే డ్రైవింగ్‌కు అత్యంత సురక్షిత దేశంగా నార్వే నిలిచింది. రోడ్డు ప్రమాదాల్లో చనిపోయే వారి సంఖ్య గతేడాది సగటున 8.9 ఉండగా, ఈ ఏడాది అది 6.3కి తగ్గిందని పేర్కొంది.
News March 30, 2025
నేడు IPLలో డబుల్ హెడర్

ఐపీఎల్లో భాగంగా ఇవాళ రెండు మ్యాచులు జరగనున్నాయి. మ.3.30 గంటలకు విశాఖపట్నంలోని ACA-VDCA స్టేడియంలో DC-SRH మధ్య మ్యాచ్ జరగనుంది. కాగా తొలి మ్యాచులో RRపై గెలిచిన SRH రెండో మ్యాచులో LSGపై ఓటమిపాలైంది. ఈ మ్యాచులో విజయం సాధించి తిరిగి పుంజుకోవాలని భావిస్తోంది. మరోవైపు ఇవాళ రాత్రి 7.30 గంటలకు గువాహతిలో RR-CSK మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. బోణీ కొట్టాలని RR, విజయం సాధించాలని CSK యోచిస్తున్నాయి.