News August 11, 2025

ఆసిమ్ మునీర్ బెదిరింపులు.. భయపడేది లేదన్న భారత్

image

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ <<17364906>>వ్యాఖ్యలపై<<>> కేంద్రం తీవ్రంగా స్పందించింది. అమెరికా నుంచి ఆయన ప్రేలాపనలు చేయడం సిగ్గుచేటని మండిపడింది. అణుదాడి చేస్తామన్న బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేసింది. జాతీయ భద్రత కోసం కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించింది. అమెరికా మద్దతిచ్చినప్పుడల్లా రెచ్చిపోవడం పాక్ ఆర్మీ చీఫ్‌కు అలవాటుగా మారిందని భారత్ విమర్శించింది.

Similar News

News August 11, 2025

జిల్లాల పేర్లు, హద్దుల మార్పుపై 13న జీవోఎం భేటీ: అనగాని

image

AP: జిల్లా, మండలాల పేర్లు, సరిహద్దుల మార్పుపై ఈనెల 13న GOM భేటీ కానుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ‘గత ప్రభుత్వం జిల్లాల పున:వ్యవస్థీకరణను అడ్డదిడ్డంగా చేసింది. వాటి సరిహద్దులు, పేర్లు మార్చాలని ప్రజలు కోరుతున్నారు. ఇంకా అర్జీలుంటే ఇవ్వొచ్చు. వీటిపై చర్చించి ప్రభుత్వానికి నివేదిస్తాం’ అని వెల్లడించారు. GOMలో నారాయణ, అనిత, జనార్దన్‌, నిమ్మల, మనోహర్, సత్యకుమార్ ఉన్నారు.

News August 11, 2025

హైదరాబాద్‌లో భారీ వర్షం

image

మహానగరంలో మరోసారి భారీ వర్షం మొదలైంది. ట్యాంక్‌బండ్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, ఉప్పల్, అత్తాపూర్, రాజేంద్రనగర్, అల్వాల్ తదితర ప్రాంతాల్లో వాన పడుతోంది. రాత్రి 9 గంటల వరకు వర్షం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. అందుకు తగ్గట్లుగా ప్రజలు ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని సూచించారు. అటు వర్షం నేపథ్యంలో GHMC మాన్సూన్ బృందాలు అలర్ట్ అయ్యాయి.

News August 11, 2025

పోలింగ్ కేంద్రాల మార్పు: హైకోర్టులో YCP పిటిషన్ రిజెక్ట్

image

AP: పులివెందుల ZPTC ఉపఎన్నికల్లో పోలింగ్ స్టేషన్ల మార్పుపై వైసీపీ దాఖలు చేసిన పిటిషన్‌ విచారణకు హైకోర్టు నిరాకరించింది. ఈ ఎన్నికల్లో ఒక ఊరిలోని 6 పోలింగ్ బూత్‌లను మరో ఊరికి మార్చడంపై వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి పిటిషన్ వేశారు. మరికొన్ని గంటల్లో(రేపు) పోలింగ్ పెట్టుకుని మార్చడం కుదరదన్న ఈసీ న్యాయవాది వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది.