News September 8, 2024

ఆధార్ కార్డుల జారీపై అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం

image

రాష్ట్రంలో అక్రమ వలసలను అడ్డుకునేందుకు ఆధార్ కార్డుల జారీ విషయంలో అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ కార్డు కావాలంటే తప్పనిసరిగా NRC నంబర్‌ను సమర్పించాలని సీఎం హిమంత బిశ్వ శర్మ స్పష్టం చేశారు. అక్టోబర్ 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందన్నారు. రాష్ట్ర జనాభా కంటే ఆధార్ కార్డుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామన్నారు.

Similar News

News October 22, 2025

కేటీఆర్, హరీశ్‌రావుతో కేసీఆర్ సమీక్ష

image

TG: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ కీలక నేతలు కేటీఆర్, హరీశ్‌రావుతో సమావేశమయ్యారు. ఎర్రవల్లి ఫాంహౌస్‌లో జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై సమీక్షిస్తున్నారు. పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా వ్యూహం, ప్రచార సరళి గురించి ఆయనకు కేటీఆర్, హరీశ్‌రావు వివరిస్తున్నారు. రేపు జరగనున్న బీఆర్‌ఎస్ ఇన్‌ఛార్జుల సమావేశంపైనా చర్చిస్తున్నట్లు సమాచారం.

News October 22, 2025

542 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తుల ఆహ్వానం

image

బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(BRO) 542 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. వెహికల్ మెకానిక్, MSW(పెయింటర్, DES)పోస్టులు ఉన్నాయి. టెన్త్, ITI అర్హతగలవారు నవంబర్ 24వరకు అప్లై చేసుకోవచ్చు. PET, ట్రేడ్ టెస్ట్/స్కిల్ టెస్ట్, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://bro.gov.in/

News October 22, 2025

గుడ్ న్యూస్.. ట్రేడ్ డీల్‌ దిశగా ఇండియా, అమెరికా

image

భారత్, అమెరికా మధ్య ట్రేడ్ డీల్ అతి త్వరలోనే కుదిరే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. వాణిజ్య చర్చల్లో పురోగతి సాధించినట్లు సమాచారం. ఒకవేళ ఒప్పందం కుదిరితే ప్రస్తుతం 50 శాతంగా ఉన్న టారిఫ్స్ 15-16 శాతానికి తగ్గే అవకాశం ఉంది. కాగా రెండు దేశాల మధ్య ట్రేడ్ డీల్ చర్చలు స్నేహపూర్వక వాతావరణంలో జరుగుతున్నాయని కేంద్ర మంత్రి <<18044575>>పీయూష్ <<>>గోయల్ చెప్పిన విషయం తెలిసిందే.