News February 4, 2025
అసెంబ్లీ వాయిదా.. హరీశ్ ఫైర్

TG: అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించిన కాసేపటికే వాయిదా వేయడంపై BRS MLA హరీశ్రావు ఫైరయ్యారు. ‘అసెంబ్లీ ప్రారంభమైన 2 నిమిషాలకే వాయిదా వేయటం ఏంటి? క్యాబినెట్ సమావేశం కొనసాగుతుందని, సబ్జెక్టు నోట్స్ సిద్ధం చేయలేదని సభను వాయిదా వేయాలని శ్రీధర్ బాబు కోరడం హాస్యాస్పదం. నాడు ప్రతిపక్షంలో ఉన్నా ప్రిపేర్ కాలేదు, నేడు ప్రభుత్వంలో ఉన్నా ప్రిపేర్ కాలేదు. ఇంకెప్పుడు ప్రిపేర్ అవుతారు?’ అని ఎద్దేవా చేశారు.
Similar News
News January 12, 2026
కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్లో 132 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<
News January 12, 2026
మారేడు దళాల నోము ఎలా చేయాలి?

సోమవారం/మాస శివరాత్రి/ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజుల్లో గణేషుడి వద్ద సంకల్పం తీసుకొని మొదలుపెట్టాలి. ఏడాది పాటు రోజూ 3 మారేడు ఆకులను, దోసెడు బియ్యాన్ని తీసుకుని శివుడిని భక్తితో పూజించాలి. ఏడాది ముగిసాక ఉద్యాపన నిర్వహించాలి. ఉద్యాపనలో బంగారు మారేడు దళం, వెండి మారేడు దళం, సహజమైన మారేడు దళాన్ని ఉంచి, మూడు దోసిళ్ల బియ్యంతో శివుడిని ఆరాధించాలి. అనంతరం పేదలకు అన్నదానం చేయడం ద్వారా ఈ నోము సంపూర్ణమవుతుంది.
News January 12, 2026
సంక్రాంతికి మరో 3 ప్రత్యేక రైళ్లు

సంక్రాంతికి ద.మ.రైల్వే అనకాపల్లి-చర్లపల్లి మధ్య అదనంగా మరో 3 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. అనకాపల్లిలో 18న ఒక ట్రైన్(07479), 19న ఒక ట్రైన్(07478) రాత్రి 10.30 గం.కు బయలుదేరి తర్వాతి రోజు ఉ.11.30గం.కు చర్లపల్లి చేరుకుంటుంది. 19న చర్లపల్లి(07477)లో అర్ధరాత్రి 12.40 గం.కు బయలుదేరి అదే రోజు రా.9 గంటలకు అనకాపల్లి చేరుకుంటుంది. ఈ రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, GNT, VJA, రాజమండ్రి మీదుగా నడుస్తాయి.


