News June 22, 2024
అసెంబ్లీ నిరవధిక వాయిదా

AP: అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. ఈరోజు సమావేశం ప్రారంభం కాగానే స్పీకర్గా అయ్యన్నపాత్రుడు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు పలువురు మంత్రులు పలు అంశాలపై సభలో మాట్లాడారు. కాగా ఈరోజు వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు సభకు గైర్హాజరయ్యారు.
Similar News
News January 11, 2026
జనవరి 11: చరిత్రలో ఈరోజు

* 1922: మధుమేహ బాధితులకు ఇన్సులిన్ అందుబాటులోకి వచ్చిన రోజు * 1944: జార్ఖండ్ రాష్ట్ర మాజీ సీఎం శిబు సోరెన్ జననం * 1966: భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మరణం * 1973: టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ పుట్టినరోజు (ఫొటోలో) * 2008: పర్వతారోహకుడు ఎడ్మండ్ హిల్లరీ మరణం
News January 11, 2026
పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీ ఏర్పాట్లు

TG: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి ఇబ్బందులు లేకుండా పంతంగి టోల్ ప్లాజా వద్ద పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మొత్తం 16 లేన్లలో విజయవాడ వైపు ప్రస్తుతం 8 లేన్లు అందుబాటులో ఉండగా, రద్దీ పెరిగితే వాటిని 10కి పెంచనున్నారు. ఫాస్ట్ట్యాగ్ సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించేందుకు ప్రతి లేన్లో 2 హ్యాండ్ స్కానర్లు, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పర్యవేక్షణకు స్పెషల్ టీమ్లు రంగంలోకి దిగాయి.
News January 11, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


