News November 22, 2024

అసెంబ్లీ నిరవధిక వాయిదా

image

AP: రాష్ట్ర అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. 10 రోజులపాటు కొనసాగిన సభలో మొత్తం 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం లభించింది. 75 ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇచ్చారు. మొత్తం 59 గంటల 57 నిమిషాల పాటు సభ కొనసాగింది. ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు వైసీపీ ఈ సమావేశాలను బహిష్కరించింది.

Similar News

News January 22, 2026

NZB: విద్యార్థినులతో కలిసి చెస్ ఆడిన కలెక్టర్

image

నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కేజీబీవీ(KGBV) విద్యార్థినులతో కలిసి నేలపై కూర్చొని ఆసక్తిగా చెస్ ఆడారు. అనంతరం ఆమె ఉపాధ్యాయురాలిగా మారి బోర్డుపై తెలుగు, హిందీ, ఆంగ్ల పాఠాలను బోధించి విద్యార్థినులను ఆశ్చర్యపరిచారు. తన వెంట తెచ్చిన చాక్లెట్లు, బిస్కెట్లు పంపిణీ చేసి వారిలో ఉత్సాహం నింపారు. కలెక్టర్ సరళత్వం, విద్యార్థినులతో మమేకమైన తీరు అందరినీ ఆకట్టుకుంది.

News January 22, 2026

సీఎం రేవంత్‌తో మంత్రి లోకేశ్ భేటీ

image

దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఏపీ మంత్రి నారా లోకేశ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రేవంత్‌ను శాలువాతో సత్కరించారు. ఇరు రాష్ట్రాల్లోని విద్యా సంస్కరణలు, ఐటీ అభివృద్ధి, స్కిల్ డెలవప్‌మెంట్‌పై తామిద్దరం చర్చించినట్లు లోకేశ్ తెలిపారు. కాగా దావోస్ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబునూ సీఎం రేవంత్ కలిసే అవకాశం ఉంది.

News January 22, 2026

భోజ్‌శాలలో సరస్వతీ పూజ, నమాజ్‌కు సుప్రీం గ్రీన్ సిగ్నల్

image

ధార్‌(MP)లోని వివాదాస్పద భోజ్‌శాల కాంప్లెక్స్‌లో రేపు (జనవరి 23) వసంత పంచమి సరస్వతీ పూజ, నమాజ్ రెండూ జరుపుకొనేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు ముస్లింలు నమాజ్ చేసుకోవడానికి అవకాశమిచ్చింది. హిందువులు రోజంతా పూజలు నిర్వహించుకోవడానికి అనుమతించింది. ఇద్దరికీ వేర్వేరు దారులు ఉండేలా చూడాలని, ప్రశాంతంగా వేడుకలు జరుపుకోవాలని సూచించింది.