News March 19, 2025
అసెంబ్లీ ఎల్లుండికి వాయిదా

TG: అసెంబ్లీ ఎల్లుండికి వాయిదా పడింది. ఇరు సభల్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం సభలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తిరిగి శుక్రవారం అసెంబ్లీ ప్రారంభం కానుంది.
Similar News
News November 17, 2025
అజొల్లాను ఎలా ఉత్పత్తి చేయవచ్చు?(1/2)

చెట్ల నీడలో గోతులు తవ్వి లేదా సిమెంట్ తొట్టెలలో లేదా పోర్టబుల్ కంటైనర్ ఉపయోగించి అజొల్లాను పెంచవచ్చు. గోతులు తవ్వి అజొల్లాను పెంచితే బయటి నుంచి ఎటువంటి వేర్లు లోపలికి రాకుండా ప్లాస్టిక్ సంచులను గోతి లోపల పరచాలి. దాని మీద పాలిథీన్ షీట్ పరిచి నీరు నిల్వ ఉంచే కృత్రిమ తొట్టెలా తయారు చేసుకోవాలి. 10-15 కిలోల సారవంతమైన మట్టిని జల్లెడ పట్టి మొత్తని మట్టిని షీట్ మీద గోతిలో ఒకే విధంగా ఉండేలా చల్లుకోవాలి.
News November 17, 2025
చిత్తూరు కలెక్టరేట్ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం

చిత్తూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఓ మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించింది. కార్యాలయాల చుట్టూ తిరిగిన తన భూ సమస్యకు పరిష్కారం దొరకలేదంటూ వి.కోట(M) మిట్టూరుకు చెందిన నందిని పురుగుల మందు తాగింది. అక్కడున్న మహిళా పోలీసులు వెంటనే స్పందించారు. ఆమెను ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 17, 2025
ఐఐటీ గువాహటీలో రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టులు

ఐఐటీ గువాహటీ 3 రీసెర్చ్ అసిస్టెంట్, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. MSc, B.Sc, డీ ఫార్మసీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈ నెల 25వరకు అప్లై చేసుకోవచ్చు. రీసెర్చ్ అసిస్టెంట్కు గరిష్ఠ వయసు 40కాగా, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్కు 35ఏళ్లు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.iitg.ac.in/


