News September 26, 2025
5 మున్సిపల్ బిల్లులకు అసెంబ్లీ ఆమోదం

AP: మంత్రి నారాయణ ప్రవేశపెట్టిన 5 కీలక MNP చట్ట సవరణ బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీంతో నాలా చట్టం రద్దయి దాని స్థానంలో ఇకపై అదనపు అభివృద్ధి ఛార్జీలు వసూలు చేయనున్నారు. బహుళ అంతస్తుల భవనాల ఎత్తు 24 మీటర్ల వరకు అనుమతిస్తారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన బిల్డింగులను క్రమబద్ధీకరించనున్నారు. వైఎస్సార్ తాడిగడప మున్సిపాల్టీ పేరును తాడిగడప మున్సిపాల్టీగా మార్చేందుకు సభ ఆమోదం తెలిపింది.
Similar News
News January 19, 2026
గుడ్డుపై అపోహలు.. వైద్యులు ఏమన్నారంటే?

కొలెస్ట్రాల్ భయంతో గుడ్లు తినడం మానేశారా? అయితే ఈ విషయం మీ కోసమే. గుడ్లు తింటే రక్తంలో కొలెస్ట్రాల్ పెరుగుతుందనే అపోహను శాస్త్రవేత్తలు కొట్టిపారేస్తున్నారు. రోజుకు ఒకటి, రెండు గుడ్లు తిన్నా ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు లేదని పైగా శరీరానికి అవసరమైన ప్రొటీన్లు, విటమిన్లు అందుతాయని డాక్టర్లు చెబుతున్నారు. గుండె ఆరోగ్యంపై దీని ప్రభావం స్వల్పమేనని, సమతుల్య ఆహారంలో భాగంగా ఎగ్ తినాలని సూచిస్తున్నారు.
News January 19, 2026
బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే ఇలా చెయ్యండి

ప్రస్తుతకాలంలో మారిన జీవనశైలి వల్ల చాలామందిలో బెల్లీ ఫ్యాట్ పెరిగిపోతోంది. దీనివల్ల డయాబెటిస్, హై బీపీ, గుండె జబ్బులు, లివర్ సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువవుతాయంటున్నారు నిపుణులు. ఆహారంలో తెల్ల బియ్యం, మైదా, స్వీట్స్, జంక్ ఫుడ్ తగ్గించడం, ప్రొటీన్ ఎక్కువగా తీసుకోవడం, క్రమంగా వ్యాయామం, మంచి నిద్ర ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి పాటిస్తూ స్ట్రెస్ తగ్గించుకోవాలని చెబుతున్నారు.
News January 19, 2026
హర్షిత్ రాణాను చూసి NZ ప్లేయర్స్ వణికారు: క్రిస్ శ్రీకాంత్

NZతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఓడిపోయినప్పటికీ ఆల్‌రౌండర్ హర్షిత్ రాణా (52) తన మెరుపు బ్యాటింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. గతంలో ఆయన ఎంపికను విమర్శించిన మాజీ క్రికెటర్ క్రిస్ శ్రీకాంత్ ఇప్పుడు హర్షిత్ ఆటతీరుకు ఫిదా అయ్యారు. ‘హర్షిత్ బ్యాటింగ్ చూస్తుంటే కివీస్ బౌలర్లు వణికిపోయారు. అతడు రియల్ గేమ్ ఛేంజర్’ అని ప్రశంసించారు. కోహ్లీ సెంచరీ వృథా అయినా.. హర్షిత్ పోరాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.


