News September 24, 2025
గ్రామ, వార్డు సచివాలయ సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

AP: గ్రామ, వార్డు సచివాలయ సెక్రటరీల విధుల్లో స్వల్ప మార్పులు చేస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. ప్రస్తుతం వార్డు సచివాలయాల్లో డిజిటల్ సెక్రటరీయే విద్యాంశాలను చూస్తున్నారు. దీనివల్ల డిజిటల్ ప్రక్రియకు ఆటంకం ఏర్పడుతోంది. తాజా బిల్లులో గ్రామ సచివాలయాల్లో మాదిరిగానే వార్డుల్లోనూ విద్యను వెల్ఫేర్ సెక్రటరీకి కేటాయిస్తున్నట్లు పొందుపరిచారు. దీనితో పాలనాపర సమస్యలు తొలగనున్నాయి.
Similar News
News September 24, 2025
‘గ్లోబల్ హెల్త్ కేర్ హబ్’గా HYD: మంత్రి శ్రీధర్

TG: హైదరాబాద్‌ను ‘గ్లోబల్ హెల్త్ కేర్ హబ్’గా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ సంకల్పమని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ‘HCA హెల్త్‌కేర్’ సంస్థ రాయదుర్గంలో ఏర్పాటు చేసిన గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్(GCC)ను ఆయన ప్రారంభించారు. ‘HCA హెల్త్‌కేర్ ప్రధానంగా US, UKలో కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఇక్కడ ₹620 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ప్రస్తుతం 1,200, 2026 నాటికి 3,000 ఉద్యోగాలు లభిస్తాయి’ అని చెప్పారు.
News September 24, 2025
మైథాలజీ క్విజ్ – 15 సమాధానాలు

1. రామ-రావణ యుద్ధంలో రాముని రథసారథి ‘మాతలి’.
2. గాంధారి తండ్రి ‘సుబలుడు’.
3. బలరాముడి తల్లి ‘రోహిణి’. దైవిక జోక్యం వల్ల బలరాముడు దేవకి గర్భం నుంచి రోహిణి గర్భంలోకి బదిలీ అవుతాడని గ్రంథాలు చెబుతున్నాయి.
4. కేదార్‌నాథ్ దేవాలయం ‘మందాకిని’ నది ఒడ్డున ఉంది.
5. తైపూసం అనే పండుగను ‘తమిళనాడు’ రాష్ట్రంలో జరుపుకొంటారు.
<<-se>>#mythologyquiz<<>>
News September 24, 2025
రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి: ఉప రాష్ట్రపతి

AP: ప్రజలపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, అందరూ సంతోషంగా ఉండాలని కనకదుర్గమ్మను వేడుకున్నట్లు ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ తెలిపారు. విజయవాడ వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని వివరించారు. అభివృద్ధి చెందుతున్న నగరాల జాబితాలో విజయవాడ ముందు వరుసలో ఉందని చెప్పారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అనంతరం ఆయన విజయవాడ ఉత్సవ్‌లో పాల్గొనేందుకు వెళ్లారు.