News July 8, 2024

22 నుంచి అసెంబ్లీ.. మళ్లీ ఓటాన్ అకౌంట్ బడ్జెటే?

image

AP: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఈ నెల 22 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడంపై ఆర్థిక శాఖ తర్జనభర్జన పడుతోంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను మరో 4 నెలలు కొనసాగించేలా ఆర్డినెన్స్ తేవాలని భావిస్తోంది. ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

Similar News

News December 16, 2025

అవెంజర్స్, సూపర్ మ్యాన్ కల్పితాలు.. మనవి సత్యాలు: బోయపాటి

image

అఖండకు అవెంజర్స్‌లా స్కోప్ ఉందని డైరెక్టర్ బోయపాటి శ్రీను అన్నారు. ‘నిజానికి అవెంజర్స్, సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ అన్నీ కల్పితాలు. కానీ మనకున్న పాత్రలన్నీ సత్యాలు. కురుక్షేత్రంలో అన్ని ఆయుధాలు వాడినట్లు రేడియేషన్ కనిపిస్తుంటుంది’ అని మీడియా సమావేశంలో అన్నారు. పూర్తి లాజిక్‌తోనే మూవీని తీశామని, అష్టసిద్ధి సాధన చేసిన తర్వాత పాత్రకు అసాధారణ శక్తులు రావడం సహజమని చెప్పారు.

News December 16, 2025

IPL-2026 మినీ వేలం అప్‌డేట్స్

image

*బంగ్లాదేశ్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను రూ.9.2 కోట్లకు కొనుగోలు చేసిన కేకేఆర్
*రూ.7 కోట్లకు వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్‌ను దక్కించుకున్న గుజరాత్ టైటాన్స్
*రాహుల్ త్రిపాఠిని రూ.75 లక్షలకు కొనుగోలు చేసిన కేకేఆర్
*నిస్సాంక- రూ.4 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)
*మాథ్యూ షార్ట్- రూ.1.50 కోట్లు (చెన్నై)

News December 16, 2025

లిక్కర్ అమ్మకాలకు డిసెంబర్ కిక్కు

image

TG: మద్యం అమ్మకాల ఆదాయం ఈ నెలలో భారీగా పెరగనుంది. స్థానిక ఎన్నికలతో తొలి 2 వారాల్లోనే ₹2వేల కోట్లు వచ్చాయి. చలి తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల లిక్కర్‌కు డిమాండ్ పెరిగింది. అటు క్రిస్మస్ ఫెస్టివల్, నూతన సంవత్సర వేడుకలూ ఉండడంతో అమ్మకాలు పెరగనున్నాయి. నెలాఖరుకల్లా మరో ₹2వేల కోట్లు సమకూరి మొత్తం ఆదాయం ₹4వేల కోట్లకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది DECలో ₹3,700 కోట్లు వచ్చాయి.