News November 3, 2024
ఈ నెల 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు

AP: ఈ నెలాఖరుతో ఓటాన్ బడ్జెట్ ముగియనున్న నేపథ్యంలో ఈ నెల 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజున ఉ.10 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో(నవంబర్-మార్చి) బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఈ సమావేశాలు 10 రోజుల పాటు కొనసాగే అవకాశముంది. పలు బిల్లులను కూడా సభలో ప్రవేశపెట్టనుంది.
Similar News
News November 1, 2025
వేలానికి బంగారు టాయిలెట్.. ప్రారంభ ధర ₹83Cr!

బంగారంతో తయారుచేసిన టాయిలెట్ కమోడ్ వేలానికి సిద్ధమైంది. ఇటాలియన్ కళాకారుడు మౌరిజియో కాటెలాన్ ఈ విచిత్ర కళాఖండానికి ‘అమెరికా’ అని పేరు పెట్టారు. ధనవంతుల అహంకారం, వారి ఆర్భాటపు జీవితం ఎంత నిష్ఫలమో ఈ ‘గోల్డ్ టాయిలెట్’ ద్వారా సందేశం ఇస్తున్నట్లు సృష్టికర్త పేర్కొన్నారు. న్యూయార్క్లో నవంబర్ 18న వేలం జరగనుంది. ప్రారంభ ధర ₹83 కోట్లుగా నిర్ణయించారు.
News November 1, 2025
ఏకాదశి వ్రతం ఎలా పాటించాలి?

ఏకాదశి వ్రతం పాటించే భక్తులు ఆ రోజున ఉపవాసం ఉండాలి. విష్ణువును తులసి మాలలతో పూజించాలి. రాత్రంతా పురాణ శ్రవణం చేస్తూ, జాగరణ చేయాలి. మరుసటి రోజు ద్వాదశి ఘడియల్లో మళ్లీ విష్ణు పూజ చేసి, భోజనం స్వీకరించాలి. అలా వ్రతం ముగుస్తుంది. ఈ వ్రతాన్ని ఆచరిస్తే నారద పురాణం ప్రకారం.. ధాన్యం, సంపద, ఉన్నత స్థానం లభిస్తాయని నమ్మకం. యజ్ఞయాగాలు, పుణ్యక్షేత్ర దర్శనాల ఫలం కన్నా ఎన్నో రెట్ల అధిక పుణ్యం వస్తుందట.
News November 1, 2025
పొడిబారిన జుట్టుకు పంప్కిన్ మాస్క్

తేమ కోల్పోయి నిర్జీవమైన జుట్టును తిరిగి పూర్వపు స్థితికి తీసుకురావాలంటే గుమ్మడికాయ హెయిర్ ప్యాక్ పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఎర్ర గుమ్మడి కాయ ముక్కల్లో కాస్త తేనె వేసి పేస్ట్ చేసుకోవాలి. దీన్ని కుదుళ్ల నుంచి జుట్టు చివర్ల వరకు అప్లై చేసుకోవాలి. 3 గంటల తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇలా తరచూ చేయడం వల్ల జుట్టు పట్టులా మృదువుగా మారుతుంది.


