News November 4, 2024
ఈ నెల 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు

ఏపీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభ తేదీని ఖరారు చేస్తూ గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 11న ఉదయం 10గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజున బడ్జెట్ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరుతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ముగియనుంది. 10 రోజుల పాటు అసెంబ్లీ సెషన్స్ నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం.
Similar News
News November 10, 2025
కూతురి విజయం.. తండ్రికి మళ్లీ పోలీస్ జాబ్!

ఉమెన్స్ WC విన్నింగ్ టీమ్ సభ్యురాలైన క్రాంతి గౌడ్‌కు మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ.కోటి నజరానా ప్రకటించింది. అంతేకాకుండా 2012లో ఎన్నికల విధుల్లో పొరపాటు వల్ల పోలీస్ ఉద్యోగం కోల్పోయిన ఆమె తండ్రి మున్నాసింగ్‌కు తిరిగి కానిస్టేబుల్ జాబ్ ఇస్తామని తెలిపింది. తన తండ్రిని మళ్లీ యూనిఫామ్‌లో చూడటం, ఆయన గౌరవంగా రిటైర్ అయ్యేలా చేయడమే తన కల అని క్రాంతి పేర్కొన్నారు. ఒకప్పుడు తమకు తిండికి కూడా ఉండేది కాదన్నారు.
News November 9, 2025
మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం: అనగాని

AP: తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఏ పని ఉన్నా అది రెవెన్యూ ఉద్యోగుల వల్లే సాధ్యమన్నారు. ‘గతంలో ఉద్యోగులను ఇబ్బందులు పెట్టారు. YCP ప్రభుత్వం భూమి సమస్యలు సృష్టించింది. కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామ సభల ద్వారా ఆ సమస్యలు పరిష్కరించాం’ అని అనంతపురం జిల్లా పర్యటనలో అన్నారు. మరోవైపు రాష్ట్రాభివృద్ధికి రెవెన్యూశాఖ పాత్ర కీలకం అని మరో మంత్రి పయ్యావుల చెప్పారు.
News November 9, 2025
‘ఎలుకల దాడి’పై మంత్రి సత్యకుమార్ సీరియస్

AP: ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులను ఎలుకలు కరవడంపై మంత్రి సత్యకుమార్ తీవ్రంగా స్పందించారు. హాస్టల్ వార్డెన్, నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ప్రైవేటు ఏజెన్సీకి నోటీసులు జారీ చేయాలని DME రఘునందన్‌ను ఆదేశించారు. హాస్టల్ వార్డెన్ వివరణ కోరుతూ మెమో ఇవ్వాలని కాలేజీ ప్రిన్సిపల్‌ను ఆదేశించారు. కాగా హాస్టల్లోని పరిస్థితులపై తనిఖీ చేస్తున్నామని డీఎంఈ మంత్రికి తెలియజేశారు.


