News February 24, 2025

అసెంబ్లీ సమావేశాలు.. ఆంక్షల విధింపు

image

AP: నేటి నుంచి అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో పరిసరాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సభ ఆవరణలో నినాదాలు చేయడం, ప్లకార్డుల ప్రదర్శన, కరపత్రాల పంపిణీకి అనుమతి లేదని స్పీకర్ స్పష్టం చేశారు. పరిసరాల్లో సమావేశాలు, ధర్నాలను పూర్తిగా నిషేధించారు. అసెంబ్లీ ప్రాంగణంలోకి ఇతరులకు ప్రవేశం లేదు, సభ్యుల పీఏలకు ప్రాంగణంలోకి వచ్చేందుకు పాస్‌లు రద్దు చేశారు.

Similar News

News February 24, 2025

జగన్ అటెండెన్స్ కోసమే అసెంబ్లీకి వచ్చారు: అచ్చెన్నాయుడు

image

AP: జగన్, YCP MLAలు అటెండెన్స్ కోసమే అసెంబ్లీకి వచ్చారని, ప్రజల కోసం కాదని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. 60 రోజులు సభకు రాకపోతే సభ్యత్వం రద్దవుతుందని, ఉపఎన్నికలు వస్తే 11సీట్లు కూడా రావనే భయంతో వచ్చారన్నారు. అవినీతి నుంచి పుట్టిన పార్టీ YCP అని మండిపడ్డారు. ఓ పేపర్, టీవీని అడ్డం పెట్టుకొని చెప్పిన అబద్ధాలే చెప్పి చెప్పి నమ్మించాలని చూస్తే ఏమయిందో మొన్నటి ఎన్నికల్లో చూశామన్నారు.

News February 24, 2025

‘దసరా’తో గేర్ ఛేంజ్.. ‘హిట్3’తో బ్లడ్ బాత్

image

ఫీల్ గుడ్ మూవీస్‌తో ఆకట్టుకున్న న్యాచురల్ స్టార్ నాని గేర్ మార్చారు. దసరాతో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేయగా ‘సరిపోదా శనివారం’తో యాక్షన్‌కు పెద్ద పీట వేశారు. తాజాగా రిలీజైన ‘హిట్3’ <<15561948>>టీజర్‌లో<<>> నాని ఊచ కోత మామూలుగా లేదని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. యాంగ్రీ పోలీస్ రోల్‌లో రక్తపాతం సృష్టించారని చెబుతున్నారు. దీంతో తర్వాత రాబోయే ‘ది ప్యారడైజ్’ ఎలా ఉంటుందో అని చర్చించుకుంటున్నారు.

News February 24, 2025

క్షణ క్షణం తీవ్ర ఉత్కంఠ.. ఏం జరుగుతోంది?

image

TG: SLBC టన్నెల్‌లో ప్రమాదం జరిగి రెండు రోజులు గడిచినా ఘటనా స్థలికి రెస్క్యూ బృందాలు చేరుకోలేకపోతున్నాయి. 14 కిలోమీటర్ల లోపల ఘటన జరగడం, బురద, నీటి లీకేజీ కారణంగా తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న 8 మంది కార్మికులు ప్రాణాలతో ఉన్నారా? లేదా? అనే ఆందోళన నెలకొంది. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. మరోవైపు సీఎం రేవంత్, మంత్రులు ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారు.

error: Content is protected !!