News October 22, 2024

రూ.49కోట్లతో అసెంబ్లీ రెనొవేషన్: మంత్రి కోమటిరెడ్డి

image

TG: అసెంబ్లీని అఘాఖాన్ ట్రస్ట్ రూ.49కోట్ల అంచనా వ్యయంతో రెనొవేట్ చేయనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ తరహాలో అసెంబ్లీ, కౌన్సిల్ ఒకే దగ్గర ఉండేలా ఏర్పాటు చేస్తామన్నారు. ఈ పనులను 3 నెలల్లో పూర్తి చేస్తామని, నిజాం కాలంలో అసెంబ్లీ ఎలా కట్టారో అలా మార్పులు చేయనున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News October 22, 2024

BREAKING: ఫలితాలు విడుదల

image

TG: రాష్ట్రంలో జూనియర్ లెక్చరర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఎంపికైన అభ్యర్థుల ప్రొవిజినల్ లిస్టును TGPSC వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. 1,392 పోస్టులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఇప్పటికే పూర్తి కాగా, తాజాగా తుది ఫలితాలను విడుదల చేశారు.

News October 22, 2024

PHOTO: ఒళ్లు గగుర్పొడిచే ఘటన

image

ఇరుకైన ప్రదేశం/గుహలో ఇరుక్కుపోతేనే మనం అల్లాడిపోతాం. అలాంటిది ఇరుకైన బండరాళ్ల సందులో తలకిందులుగా ఉండిపోతే? ఆ పరిస్థితిని ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది కదా? తాజాగా ఆస్ట్రేలియాలో ట్రెక్కింగ్‌కు వెళ్లిన యువతికి ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. రెండు బండరాళ్ల మధ్య పడిన ఫోన్‌ను తీసుకునే ప్రయత్నంలో ఇరుక్కుపోయింది. ఆమె ఫ్రెండ్ వెంటనే రెస్క్యూ బృందాలకు సమాచారం అందించగా 7 గంటల శ్రమ తర్వాత బయటికి తీసుకొచ్చారు.

News October 22, 2024

BSNL కొత్త లోగో.. మరిన్ని సేవలు ప్రారంభం

image

ప్రైవేటు టెలికం సంస్థ‌ల టారిఫ్‌ల పెంపుతో అనూహ్యంగా పుంజుకున్న BSNL వినియోగ‌దారుల‌కు మ‌రింత చేరువ‌య్యే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది. కొత్త బ్రాండ్ లోగోతో Connecting Bharat – Securely, Affordably, and Reliably నినాదంతో ముందుకొచ్చింది. కొత్త లోగోను కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆవిష్క‌రించారు. అలాగే స్పామ్ ఫ్రీ నెట్‌వర్క్, Wi-Fi రోమింగ్, డైరెక్ట్ టు డివైజ్ కనెక్టివిటీ సేవల్ని ప్రారంభించింది.