News March 16, 2024

రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలిలా..

image

రాష్ట్రంలో మొత్తం 25 పార్లమెంటు స్థానాలున్నాయి. 2019 ఎన్నికల్లో YCP 22 సీట్లు గెలుచుకోగా.. టీడీపీ 3 సీట్లకే పరిమితమైంది.
* మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో వైసీపీ 151, టీడీపీ 23, జనసేన 1 సీటు గెలిచాయి. 2014తో పోల్చితే వైసీపీకి 84సీట్లు పెరిగాయి. టీడీపీ 49 సీట్లు కోల్పోయింది.

Similar News

News August 17, 2025

రూ.150 కోట్లు దాటిన ‘వార్-2’ కలెక్షన్లు

image

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘వార్-2’ ఇవాళ మధ్యాహ్నం వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లు వసూలు చేసినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. తొలి రెండు రోజుల్లో రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు రాగా నిన్న, ఇవాళ కాస్త తగ్గినట్లు వెల్లడించాయి. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది.

News August 17, 2025

అలాంటి సినిమాలను ఆపేయాలి: లోకేశ్

image

AP: సినిమాల్లో మహిళలపై వివక్షను కట్టడి చేసేందుకు సమయం ఆసన్నమైందని మంత్రి లోకేశ్ అన్నారు. ‘మహిళలకు మనమిచ్చే గౌరవమే నిజమైన నాగరిక సమాజానికి పునాది. వారి పట్ల లింగ వివక్ష, అవమానకరమైన సంభాషణలను కట్టడి చేయాలి. అలాంటి డైలాగ్స్ ఉన్న మూవీ లేదా సీరియల్‌ను ఆపేయాలి. ఇంట్లో, స్క్రీన్‌పై చూసే అంశాలు పిల్లలపై ప్రభావం చూపుతాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు.

News August 17, 2025

‘ఓటు చోరీ’ అనడం రాజ్యాంగాన్ని అవమానించడమే: ఈసీ

image

ఓటర్ల గోప్యతకు భద్రత కల్పించాల్సిన బాధ్యత తమదేనని CEC జ్ఞానేశ్ కుమార్ చెప్పారు. ఓట్ల చోరీ అంటూ ఈసీపై ఆరోపణలు చేయడం రాజ్యాంగాన్ని అవమానించడమేనని వ్యాఖ్యానించారు. ఓటర్ల విషయంలో ధనిక, పేద, లింగ భేదాలు ఉండవని స్పష్టం చేశారు. బిహార్‌ ఓటరు జాబితా విషయంలో ECపై ఆరోపణలు చేస్తున్నారని, జాబితా తయారీలో స్పష్టమైన వైఖరితో ఉన్నామని తెలిపారు. బిహార్ SIRలో అన్ని పార్టీలను భాగస్వామ్యం చేశామని పేర్కొన్నారు.