News August 25, 2025
ఒకే జిల్లా పరిధిలోకి అసెంబ్లీ సెగ్మెంట్స్!

TG: జనాభా లెక్కల అనంతరం కేంద్రం డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టనున్న విషయం తెలిసిందే. దీంతో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరగడంతో పాటు జిల్లాలకు తగ్గట్టు సరిహద్దులు మారనున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 38 సెగ్మెంట్లు 2, 3 జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. డీలిమిటేషన్ తర్వాత వీటితో పాటు కొత్తగా ఏర్పడే నియోజకవర్గాలు సైతం ఒకే జిల్లా పరిధిలోకి రానున్నాయి. దీంతో రాజకీయ సమీకరణాలు కూడా మారుతాయి.
Similar News
News August 25, 2025
స్కూళ్లలో ఉచిత ప్రవేశాల లాటరీ ఫలితాలు విడుదల

AP: RTE కింద పేద విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో 25% సీట్లు ఇస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 1వ తరగతి ఉచిత ప్రవేశాల అదనపు నోటిఫికేషన్ లాటరీ ఫలితాలు విడుదల అయ్యాయి. 11,702మంది ఎంపిక కాగా, ఆగస్టు 31లోపు విద్యార్థులు స్కూళ్లలో చేరాలని విద్యాశాఖ తెలిపింది. ఎంపికైన విద్యార్థుల సమాచారం తల్లిదండ్రుల ఫోన్ నంబర్లకు అందుతుందని చెప్పింది. ఈ <
News August 25, 2025
ఉత్తమ టీచర్ అవార్డులు ప్రకటించిన కేంద్రం

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులకు 45 మంది <
News August 25, 2025
మోదీ డిగ్రీ వివరాలను వెల్లడించాలన్న ఆదేశాలు కొట్టివేత

PM మోదీ డిగ్రీ సమాచారాన్ని బహిర్గతం చేయాలని కేంద్ర సమాచార కమిషన్(CIC) ఇచ్చిన ఆదేశాలను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. ఆ వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేదని తీర్పునిచ్చింది. తాను ఢిల్లీ యూనివర్సిటీ నుంచి 1978లో BA పాసైనట్లు గతంలో మోదీ ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొనగా, ఆ వివరాల కోసం ఓ వ్యక్తి RTI దాఖలు చేశారు. ఈ వివరాలు ఇవ్వాలని CIC ఆదేశాలు జారీ చేయగా, వాటిని ఢిల్లీ వర్సిటీ కోర్టులో సవాల్ చేసింది.