News November 18, 2024

అసెంబ్లీ సమావేశం ప్రారంభం

image

AP: ఆరో రోజు అసెంబ్లీ సమావేశం ప్రారంభమైంది. క్వశ్చన్ అవర్‌తో సభను ప్రారంభించారు. గ్రాంట్స్ కోసం పలు శాఖల మంత్రులు అభ్యర్థన చేయనున్నట్లు తెలుస్తోంది. సభలో ప్రవేశపెట్టిన ఏడు బిల్లులపై చర్చ జరిపి ఆమోదం తెలిపే అవకాశముంది.

Similar News

News February 19, 2026

AIIMS గోరఖ్‌పూర్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తుల ఆహ్వానం

image

<>AIIMS <<>>గోరఖ్‌పూర్‌లో 8 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ, PG(జియోగ్రఫీ, బయో స్టాటిస్టిక్స్, డెమోగ్రఫీ, పాపులేషన్ స్టడీస్), PhD అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్(PRS)2కు నెలకు రూ.80,400, PRS 1కు రూ.67,200, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్‌కు రూ.33,600, Sr. ప్రాజెక్ట్ అసిస్టెంట్‌కు రూ.30,600, డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు రూ.29,200 చెల్లిస్తారు.

News February 19, 2026

పంటల్లో చెదపురుగులు.. నివారణకు సూచనలు

image

పంటల్లో చెదపురుగుల ఉద్ధృతి తగ్గాలంటే వేసవిలో లోతు దుక్కులు చేసుకోవాలి. గట్లపై కలుపు లేకుండా చూడాలి. బాగి చివికిన పశువుల ఎరువును వేసి కలియదున్నాలి. పంట మార్పిడి విధానం అనుసరించాలి. పసుపును అంతర పంటగా వేసుకోవాలి. పంట వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించి, తల్లి చెదపురుగును గుర్తించి నాశనం చేయాలి. చెద ఆశించిన మొక్కల మొదళ్లలో లీటర్ నీటికి క్లోరిపైరిఫాస్ 50% EC 2ml కలిపి పిచికారీ చేసి నివారించవచ్చు.

News February 19, 2026

ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

image

ఉచిత పథకాల వల్ల ఆర్థికాభివృద్ధికి ఆటంకం కలుగుతుందని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. అర్హులకు మాత్రమే ఉచిత పథకాలు అందాలని సూచించింది. భూస్వాములు కూడా ఉచిత విద్యుత్ పొందుతున్నారని గుర్తుచేసింది. ఆర్థిక లోటులో ఉన్న రాష్ట్రాలూ ఉచితాలు కొనసాగిస్తున్నాయని తెలిపింది. ఆ సొమ్మును ప్రణాళికాబద్ధంగా వాడాలని సూచించింది. DMK ఉచిత విద్యుత్‌ ప్రతిపాదనల పిటిషన్‌ను విచారిస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.