News February 7, 2025
24 నుంచి అసెంబ్లీ సమావేశాలు

AP: ఈ నెల 24 నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 28న లేదా మార్చి 3వ తేదీ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 15 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. BAC సమావేశం తర్వాత ఎన్నిరోజులు నిర్వహించాలనే దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది.
Similar News
News January 28, 2026
తిరుపతిలో ఉద్యోగుల అత్యుత్సాహం..!

తిరుపతి విద్యాశాఖలో కొందరు ఉద్యోగుల అత్యుత్సాహం ఇతర ఉద్యోగులకు ఇబ్బందిగా మారింది. ఉన్నతాధికారికి మించి అన్నింటిలో తమదే పైచేయి అనేలా వ్యవహరిస్తున్నారు. నాయకుల అండదండలతో పోస్టింగ్ వేసుకున్న వీరు తాము ఎంత చెబితే అంతే అని ప్రైవేట్ పాఠశాల వద్ద చెబుతున్నారంట. రాజకీయ ప్రమేయంతో వీరిని ఏమీ అనలేని పరిస్థితి నెలకొందని సమాచారం. ఇలాంటి వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి మరి.
News January 28, 2026
నిద్రలో శివుడు కనిపిస్తే..?

కలలో శివుడు కనిపించడం అదృష్టమని స్వప్న శాస్త్రం చెబుతోంది. శివుడికి సంబంధించి ఏ వస్తువు కనిపించినా కష్టాలు తీరుతాయని, త్వరలోనే శుభవార్తలు వింటారని అర్థం. శివలింగం కనిపిస్తే చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. గర్భవతులకు శివలింగం కనిపిస్తే పుత్ర సంతానం కలుగుతుంది. శివాలయం కనిపిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఈశ్వరుడు కలలో రావడం భవిష్యత్తులో జరగబోయే శుభపరిణామాలకు సంకేతం.
News January 28, 2026
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. SSD టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 8 గంటలు, స్పెషల్ ఎంట్రీ దర్శనానికి 5 గంటలు పడుతోంది. క్యూకాంప్లెక్స్లోని 18 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 77,049 మంది దర్శించుకోగా, 21,469 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.73 కోట్లు వచ్చింది. టోకెన్ కలిగిన భక్తులు కేటాయించిన సమయానికే క్యూలోకి రావాలని TTD సూచించింది.


