News January 29, 2025
వచ్చే నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు!

AP: ఫిబ్రవరి 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 25 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. FEB నెలాఖరులో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. కాగా కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే.
Similar News
News December 12, 2025
నా వ్యక్తిత్వ హక్కులను కాపాడండి.. హైకోర్టులో పవన్ పిటిషన్

AP: తన వ్యక్తిత్వ హక్కులను కాపాడాలంటూ Dy.CM పవన్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. AI వీడియోలతో పవన్ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా SMలో పోస్టులు చేస్తున్నారని ఆయన తరఫు లాయర్ తెలిపారు. దీంతో డిలీట్ చేసేందుకు ఆ లింక్లను 48hrsలోపు SM సంస్థలకు అందించాలని న్యాయమూర్తి సూచించారు. వాటిపై వారంలోపు చర్యలు తీసుకోవాలని గూగుల్, మెటా తదితర ప్లాట్ఫామ్లను ఆదేశిస్తూ తదుపరి విచారణను DEC 22కు వాయిదా వేశారు.
News December 12, 2025
వాట్సాప్లో మరో 2 కొత్త ఫీచర్లు

మెసేజింగ్ యాప్ వాట్సాప్ రెండు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్ కాల్ రిసీవ్ చేసుకోని వారికి వాయిస్ మెసేజ్ పంపే వెసులుబాటు కల్పించింది. వాయిస్ కాల్ చేస్తే వాయిస్ మెసేజ్, వీడియో కాల్ చేస్తే వీడియో మెసేజ్ పంపించే వన్ టచ్ ఆప్షన్ ప్రవేశపెట్టింది. వాయిస్మెయిల్ పేరుతో ఈ ఫీచర్ అందుబాటులో ఉండేది. ఫ్లక్స్, మిడ్ జర్నీల సహకారంతో కొత్త తరహా ఇమేజ్లను క్రియేట్ చేసుకునే ఫీచర్ తీసుకొచ్చింది.
News December 12, 2025
IIRSలో 11 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్(IIRS)లో 11 JRF పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. సంబంధిత విభాగంలో ఎంటెక్, ఎంఈ, ఎంఆర్క్, ఎంఎస్సీలో 60శాతం మార్కులతో ఉత్తీర్ణతతో పాటు NET,GATE అర్హత సాధించి ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.iirs.gov.in/


