News June 24, 2024
జులై మూడో వారంలో అసెంబ్లీ సెషన్స్?

ఏపీ అసెంబ్లీ సమావేశాలు జులై మూడో వారంలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు వచ్చే నెలాఖరుతో ముగియనుంది. దీంతో ఆగస్టు నుంచి 2025 మార్చి ఆఖరు వరకు అవసరమైన బడ్జెట్ ఆమోదం కోసం ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. అలాగే కీలకమైన ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టం రద్దుతో పాటు పలు బిల్లుల్ని సభలో ప్రవేశపెట్టే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.
Similar News
News December 12, 2025
ఉపాధి హామీ పథకం పేరు మార్చిన కేంద్రం

ఉపాధి హామీ పథకం పేరు మార్పునకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ‘పూజ్య బాపు గ్రామీణ ఉపాధి హామీ పథకం’గా పేరు మార్చింది. అదే విధంగా ఏడాదికి 120 రోజుల పని దినాలను తప్పనిసరి చేసింది. ఈ స్కీంకు రూ.లక్షా 51 వేల కోట్లు కేటాయించింది.
News December 12, 2025
వై నాట్ వైజాగ్.. అనేలా పరిశ్రమలకు ఆహ్వానం: లోకేశ్

AP: విశాఖ ప్రాంతానికి రానున్న కాలంలో 5 లక్షల ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తామని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. ‘వై నాట్ వైజాగ్… అనేలా ఐటీ, ఇతర పరిశ్రమల్ని ఆహ్వానిస్తున్నాం. IT, GCC కేంద్రంగా VSP మారుతుంది. ఎకనామిక్ రీజియన్ కూడా ఈ ప్రాంత అభివృద్ధిని మారుస్తుంది. APకి వచ్చే ప్రతి ప్రాజెక్టును ప్రభుత్వానిదిగా భావించి చేయూత ఇస్తాం’ అని వివరించారు. ఆర్సెలార్ మిట్టల్, గూగుల్ ఇక్కడకు వస్తున్నాయన్నారు.
News December 12, 2025
మిరపలో నల్ల తామర పురుగుల నివారణ ఎలా?

మిరపలో నల్ల తామర పురుగుల తీవ్రతను బట్టి ఎకరానికి 25కు పైగా నీలి రంగు జిగురు అట్టలను ఏర్పాటు చేసుకోవాలి. అలాగే బవేరియా బస్సియానా 5 గ్రాములు లేదా స్పైనటోరం 0.9ml మందును లేదా ఫిప్రోనిల్ 5% ఎస్.సి 2ML లేదా స్పైనోసాడ్ 45% ఎస్.సి 0.3MLలలో ఏదో ఒకదానిని లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. తామర పురుగు ఉద్ధృతిని బట్టి ఈ మందులను మార్చిమార్చి పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.


