News March 13, 2025
అసెంబ్లీ: బీఆర్ఎస్‌ఎల్పీలో ఉద్రిక్తత

తెలంగాణ అసెంబ్లీలో హైడ్రామా కొనసాగుతోంది. తనపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేయడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి వెళ్లి బీఆర్ఎస్‌ఎల్పీలోని కేసీఆర్ ఛాంబర్‌లో కూర్చున్నారు. అయితే ఆయన వద్దకు వెళ్లిన మార్షల్స్ అసెంబ్లీ నుంచి బయటికి వెళ్లాలని సూచించారు. దీంతో జగదీశ్, కేటీఆర్, హరీశ్, తలసాని వారితో వాగ్వాదానికి దిగారు. ప్రతిపక్ష నేత ఛాంబర్‌లో కూర్చుంటే అభ్యంతరమేంటని ప్రశ్నించారు.
Similar News
News March 28, 2026
భారత్ నుంచి శ్రీలంక, బంగ్లాకు 53వేల టన్నుల పెట్రోల్, డీజిల్

ఇంధన సంక్షోభం వేళ శ్రీలంక, బంగ్లాదేశ్‌లకు భారత్ అండగా నిలిచింది. శ్రీలంకకు 20వేల టన్నుల డీజిల్, 18 వేల టన్నుల పెట్రోల్ పంపింది. బంగ్లాకు 5వేల టన్నుల డీజిల్ పంపించింది. యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి 15వేల టన్నుల డీజిల్ వచ్చినట్లు బంగ్లాదేశ్ పెట్రోలియం కార్పొరేషన్ తెలిపింది. వచ్చే నెలలో 45వేల టన్నుల డీజిల్ రానుందని పేర్కొంది. ఈ సంక్షోభ సమయంలో ఆ దేశాలకు పంపడం అవసరమా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
News March 28, 2026
ఇరాన్‌తో యుద్ధం.. ట్రంప్‌కు అమెరికన్ల షాక్

యుద్ధోన్మాదంతో చెలరేగుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు సొంత ప్రజల్లో ఆదరణ దారుణంగా పడిపోయింది. ఫాక్స్ న్యూస్ పోల్ సర్వేలో ఆయన తీరుపట్ల 59% మంది ఓటర్లు అసంతృప్తి వ్యక్తం చేయగా, వీరిలో 47% మంది తీవ్రంగా వ్యతిరేకించారు. 41% మంది మాత్రమే ఆయనను సమర్థించారు. అలాగే ట్రంప్ విదేశాంగ విధానాన్ని ఏకంగా 62% మంది, ఇరాన్‌తో ఘర్షణల విషయంలో ఆయన తీరును 64% మంది తప్పుపట్టారు.
News March 28, 2026
మెదడుకు విశ్రాంతినిచ్చే ‘బ్రెయిన్‌కేషన్’

ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతత కోసం ‘బ్రెయిన్‌కేషన్’ అనే కొత్త ట్రెండ్ ప్రాచుర్యం పొందుతోంది. ఇది మెదడుకు ఇచ్చే చిన్న సెలవు లాంటిది. రోజువారీ డిజిటల్ ప్రపంచం, సోషల్ మీడియా, పని ఒత్తిడి నుంచి పూర్తిగా దూరంగా ఉంటూ.. ఎటువంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా ఉండడమే దీని ఉద్దేశం. ఫోన్‌ను పక్కన పెట్టడమే కాకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. మనసుకు నచ్చినట్లు గడపాలి. దీన్నే ‘బ్రెయిన్‌కేషన్’ అంటారు.


