News December 30, 2024

నేడు అసెంబ్లీ.. కేసీఆర్ వస్తారా?

image

TG: దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు నివాళులర్పించేందుకు రాష్ట్ర శాసనసభ ఈరోజు ప్రత్యేకంగా సమావేశమవనుంది. ఉదయం పదింటికి సభ ప్రారంభం కాగానే సీఎం రేవంత్ సంతాప తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో మన్మోహన్ కృషిని సభ్యులు గుర్తుచేసుకోనున్నారు. కాగా.. మన్మోహన్‌తో ఉన్న అనుబంధం దృష్ట్యా మాజీ సీఎం కేసీఆర్ సభకు వచ్చే అవకాశం ఉందా అన్నది ఆసక్తికరంగా మారింది.

Similar News

News December 10, 2025

కోడి పిల్లల పెంపకం – బ్రూడింగ్ కీలకం

image

కోడి పిల్లలు గుడ్డు నుంచి బయటకొచ్చాక కృత్రిమంగా వేడిని అందించడాన్ని “బ్రూడింగ్” అంటారు. వాతావరణ పరిస్థితులను బట్టి బ్రూడింగ్‌ను 4-6 వారాల పాటు చేపట్టాల్సి ఉంటుంది. అయితే బ్రూడర్ కింద వేడిని కోడి పిల్లల వయసును బట్టి క్రమంగా తగ్గించాలి. బ్రూడర్ కింద వేడి ఎక్కువైతే పిల్లలు దూరంగా వెళ్లిపోతాయి. తక్కువైతే పిల్లలన్నీ మధ్యలో గుంపుగా ఉంటాయి. దీన్ని బట్టి వేడిని అంచనా వేసి వేడిని తగ్గించడం, పెంచడం చేయాలి.

News December 10, 2025

తెలంగాణ న్యూస్ రౌండప్

image

⭒ నేడు ఉస్మానియా వర్సిటీకి సీఎం రేవంత్.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం
⭒ 2047 నాటికి HYDలో 623kms మేర మెట్రో నెట్‌వర్క్‌ను విస్తరించనున్నట్లు విజన్ డాక్యుమెంట్‌లో పేర్కొన్న ప్రభుత్వం
⭒ యువతకు అడ్వాన్స్‌డ్ స్కిల్స్‌పై శిక్షణ, ఉపాధి కల్పనపై టాటా టెక్, అపోలో సహా పలు సంస్థలతో ప్రభుత్వం రూ.72కోట్ల విలువైన 9 ఒప్పందాలు

News December 10, 2025

గాయపడిన సింహం.. తిరిగొచ్చి అదరగొట్టింది!

image

‘గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జనకన్నా భయంకరంగా ఉంటుంది’ అనే డైలాగ్ హార్దిక్ పాండ్యకు సరిగ్గా సరిపోతుంది. గాయం నుంచి కోలుకుని SAతో తొలి T20లో రీఎంట్రీ ఇచ్చిన అతడు 28 బంతుల్లో 59* రన్స్ చేశారు. ఓవైపు ఇతర బ్యాటర్లు వికెట్ కాపాడుకునేందుకే అవస్థలు పడుతుంటే పాండ్య మాత్రం కామ్&కంపోజ్డ్ షాట్లతో విరుచుకుపడ్డారు. బౌలింగ్‌లోనూ తొలి బంతికే వికెట్ తీశారు. ఇరు జట్లలో వేరే ఏ ఆటగాడు 30+ స్కోర్ చేయలేదు.